Mutual Funds: పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ.. అస్సలు రిస్క్ ఉండని బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
వ్యక్తిగత స్టాక్‌లు, బాండ్లతో పోల్చినప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు మంచి రాబడితో పాటు తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అనేక మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ప్రత్యేకంగా నాలుగు రకాల ఫండ్స్ వివరాలు.. వాటి నుంచి వచ్చే రాబడి తదితర వివరాలను పరిశీలిద్దాం..

మ్యూచువల్ ఫండ్స్ కు ఇటీవల ఆదరణ బాగా పెరిగింది. చాలా మంది వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు ఎక్కువగా చేసేవారు. ప్రస్తుతం వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. కొంచెం రిస్క్ ఉన్నా రాబడి అధికంగా ఉండడమే దీనికి కారణం. సాధారణంగా మన దేశంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు ఎక్కువగా పెడుతుంటారు. వీటిలో ఉండే కొన్ని నష్టాలను భరించలేనివారు మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. మెరుగైన రాబడిని కోరుకునేవారందరికీ ఇవి అనుకూలంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీలో డబ్బు పెట్టడం బాగా ఎక్కువైంది. ఈ విధానం అత్యంత ప్రజాదరణ పొందింది. వ్యక్తిగత స్టాక్‌లు, బాండ్లతో పోల్చినప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు మంచి రాబడితో పాటు తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అనేక మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ప్రత్యేకంగా నాలుగు రకాల ఫండ్స్ వివరాలు.. వాటి నుంచి వచ్చే రాబడి తదితర వివరాలను పరిశీలిద్దాం..
నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్..
నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ పీఎస్‌యూ బ్యాంక్ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలంగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే మూడేళ్లలో మనకు వచ్చే రాబడి 227.94 శాతంగా ఉంది. ఉదాహరణకు ఈ ఈటీఎఫ్‌లో రూ.1,00,000 పెట్టుబడి పెడితే, మూడేళ్ల తర్వాత రూ.3,27,940 లభిస్తాయి. అంటే మ్యూచువల్ ఫండ్ మూడేళ్ల వార్షిక రాబడి 48.4 శాతంగా ఉంది.
కోటక్ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్..
ఈ ఫండ్ కూడా పెట్టుబడి దారులకు మంచి రాబడిని ఇస్తుంది. దీని ద్వారా మూడు సంవత్సరాలలో 227.49 శాతం రాబడి వస్తుంది. దీనిలో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్ల తర్వాత రూ.3,27,490 పొందుతారు. అంటే మూడేళ్ల వార్షిక రాబడి 48.40 శాతం.
ఏబీఎస్ఎల్ పీఎస్‌యూ ఈక్విటీ ఫండ్..
దీనిపూర్తి పేరు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పీఎస్ యూ ఈక్విటీ ఫండ్. ఇది కూడా పెట్టుబడిదారులకు మంచి ఎంపిక. రాబడి కూడా చాలా బాగుంది. మూడేళ్ల సంపూర్ణ రాబడి 183.55 శాతంగా ఉంది. మ్యూచువల్ ఫండ్‌లో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో రూ.2,83,550 వస్తుంది. ఫండ్ వార్షిక మూడేళ్ల రాబడి 41.45 శాతం.
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్..
ఈ ఫండ్ కూడా మూడేళ్లలో పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించింది. ఫండ్ నుంచి మూడు సంవత్సరాలలో వచ్చే రాబడి 193.15 శాతంగా ఉంది. దీనిలో రూ.1,00,000 పెట్టుబడి పెడితే మూడేళ్లలో రూ.2,93,150 పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








