Gold Price Today: గోల్డ్ కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి పరుగులు పెడుతోంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల బంగారం దాదాపు 70 వేల వరకు చేరువైంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. ధరలు ఒక్కోసారి పెరిగితే..

Gold Price Today: గోల్డ్ కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us

|

Updated on: Mar 31, 2024 | 6:23 AM

ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి పరుగులు పెడుతోంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల బంగారం దాదాపు 70 వేల వరకు చేరువైంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. అయితే, స్వతహాగా భారతీయ మహిళలు ఆభరణ ప్రియులు. పైగా శుభ సందర్భం ఏదైనా తాహతుకు తగ్గట్టు ఎంతోకొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. అందరూ వీటి ధరలపై దృష్టిసారిస్తుంటారు.

తాజాగా.. గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.62,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.68,450 గా ఉంది. కిలో వెండి ధర రూ.78,000 లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,900 ఉంటే.. 24 క్యారెట్ల రేట్ రూ.68,600 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.62,750, 24 క్యారెట్లు రూ.68,450, చెన్నైలో 22క్యారెట్లు రూ.63,700, 24క్యారెట్లు రూ.69,490, బెంగళూరులో 22 క్యారెట్లు రూ.62,750, 24క్యారెట్ల ధర రూ.68,450 గా ఉంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750, 24క్యారెట్ల ధర రూ.68,450 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000, ముంబైలో రూ.78,000, బెంగళూరులో రూ.77,000, చెన్నైలో రూ.81,000, కేరళలో రూ.81,000, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో రూ.81,000 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..