Child Investment Plans: పిల్లల కోసం బంగారం లాంటి పథకాలు ఇవి.. వారి భవితకు కొండంత భరోసా.. 

మీ నెలవారీ సంపాదనలో నుంచి కొంత మొత్తాన్ని పక్కకు తీయడం ద్వారానే మీరు లాంగ్ టెర్మ్ లో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చని మీకు తెలుసా? నిజం అండి.. చిన్న మొత్తంలో నెలవారీ కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లలు యుక్త వయసుకు వచ్చే సరికి వారి అవసరాలకు తగిన మొత్తం సమకూరుతుంది. అలాంటి పథకాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వ మద్దతు, భరోసా ఆయా పథకాలకు ఉంటాయి.

Child Investment Plans: పిల్లల కోసం బంగారం లాంటి పథకాలు ఇవి.. వారి భవితకు కొండంత భరోసా.. 
Child Saving Scheme

Updated on: Jan 11, 2024 | 7:05 PM

పిల్లల ప్రాధాన్యాలు మారిపోతున్నాయి. ఉన్నత చదువులు విదేశాల్లో చదవాలని, భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని వారు కలలు కంటున్నారు. అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం తల్లిదండ్రులుగా అందరి బాధ్యత. వారు కోరుకున్న విధంగా, వారి జీవితాన్ని అందించేందుకు తల్లిదండ్రులు తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలి. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలి. వారి చదువులు, పెళ్లిళ్ల సమయానికి అవసరమైన నిధులను చిన్ననాటి నుంచి కూడబెట్టాలి. కేవలం మీ నెలవారీ సంపాదనలో నుంచి కొంత మొత్తాన్ని పక్కకు తీయడం ద్వారానే మీరు లాంగ్ టెర్మ్ లో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చని మీకు తెలుసా? నిజం అండి.. చిన్న మొత్తంలో నెలవారీ కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లలు యుక్త వయసుకు వచ్చే సరికి వారి అవసరాలకు తగిన మొత్తం సమకూరుతుంది. అలాంటి పథకాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వ మద్దతు, భరోసా ఆయా పథకాలకు ఉంటాయి. ఆయా పథకాల్లో మీరు నెలవారీ పెట్టుబడి పెడుతూ ఉంటే.. మంచి వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తం లభిస్తుంది కాబట్టి అవి వారి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అటువంటి బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆడ బిడ్డలకు వరం.. సుకన్య సమృద్ధి యోజన..

కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం ఇది. పదేళ్ల కంటే తక్కువ వయసున్న ఆడ బిడ్డల పేరిట తల్లిదండ్రులు ఈ పథకాన్ని ప్రారంభించొచ్చు. పోస్టాఫీసు లేదా బ్యాంకులలో ఈ ఖాతా తెరవచ్చు. దీనిలో నెలనెలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా 1.50లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. దీనిపై మంచి వడ్డీ రేటు వస్తుంది. పైగా ఈ పథకం వడ్డీ రేటు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం దీనిపై 8.20శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకం కాల వ్యవధి 21 సంవత్సరాలు. మీ అమ్మాయి 18 ఏళ్లు నిండిన తర్వాత విద్యా అవసరాల కోసం అప్పటి వరకూ దాచిన మొత్తం నుంచి సగం విత్ డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా అమ్మాయికి 21 ఏళ్లు నిండితే మొత్తం నగదు తీసుకోవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)..

పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చడంలో ఈ పథకం కూడా బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పథకం 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 500 నుంచి మొదలు పెట్టి రూ. 1.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. దీనిపై ప్రస్తుతం 7.10శాతం వడ్డీ వస్తుంది. పిల్లల చిన్నప్పుడే ఈ పథకంలో చేరితే .. వారి ఉన్నత విద్యావసరాలు, పెళ్లిళ్లకు బాగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్)..

సాధారణంగా ప్రతి ఉద్యోగికి ప్రతి నెలా తమ వేతానాల్లో నుంచి 12శాతం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) రూపంలో కట్ అవుతుంది. అయితే దీనిని మీరు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మరింత ఎక్కువ చేసుకునే వీలుంటుంది. మీ బేసిక్ శాలరీని బట్టి 100శాతం వరకూ పొదుపు చేసుకోవచ్చు. ఇలా స్వచ్ఛందంగా నగదు పొదుపు చేయొచ్చు. దీనినే వీపీఎఫ్ అని పిలుస్తారు. ఈపీఎఫ్ లో ఎంత వడ్డీ వస్తుందో.. ఈ వీపీఎఫ్ లో కూడా వడ్డీ ఉంటుంది. ప్రస్తుతం దీనిపై వడ్డీ 8.15శాతం వరకూ వడ్డీ వస్తుంది. అలాగే దీనిపై సంపాదించిన మొత్తానికి పన్ను రాయితీ కూడా ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్..

కనీసం పదేళ్ల కాలపరిమితితో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవి మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుంటాయి కాబట్టి వీటిల్లో కాస్త రిస్క్ ఉంటాయి. అయితే రిస్క్ తక్కువ ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ను ఎంచుకోవడం మేు. అందుకోసం మీరు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

గోల్డ్ ఈటీఎఫ్స్..

మీకు బంగారంపై పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే.. ప్రత్యక్ష బంగారంపై పెట్టుబడి కాకుండా గోల్డ్ ఎక్స్ చేంజి ట్రేడెడ్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే దీని కోసం కచ్చితంగా డీ మ్యాట్ అకౌంట్ ఉండాల్సిన అవసరం ఉంది. షేర్ రూపంలో ఈటీఎఫ్ కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..