
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి సురక్షితమైన ఈక్విటీ వర్గాలలో లార్జ్ క్యాప్ ఫండ్స్ ఒకటిగా ఉంటుంది. మిడ్-క్యాప్ లేదా స్మాల్-క్యాప్ ఫండ్ల కంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడి తక్కువగా ఉన్నప్పటికీ అవి మరింత స్థిరంగా ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ ఫండ్స్ 35 శాతం వరకు రాబడిని ఇచ్చాయి. అయితే అవి కూడా తీవ్ర క్షీణత, నష్టాలను చవిచూశాయి. అయితే లార్జ్ పెద్ద క్యాప్ ఫండ్‌లు గణనీయంగా తక్కువ రిస్క్‌తో దాదాపు 11-12 శాతం స్థిరమైన రాబడిని అందించాయి. సాధారణంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఫండ్స్ అధిక రాబడిని అందిస్తాయి. అయితే అవి కూడా ఎక్కువ రిస్క్‌ను కలిగి ఉంటాయి. మీరు స్థిరమైన రాబడి కోసం చూస్తుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ మంచి ఎంపిక నిపుణులు చెబుతున్నారు.
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన కంటే ఎక్కువ రాబడిని అందించే కొన్ని టాప్ పెర్ఫార్మింగ్ లార్జ్ క్యాప్ ఫండ్‌ల గురించి ఓ సారి తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల 7 శాతం నుంచి 8 శాతం రాబడిని అందిస్తుంది. అయితే పెట్టుబడి కాలం 15 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. అంటే లార్జ్ క్యాప్ ఫండ్‌లు 10 సంవత్సరాలలోపు 11 శాతం వరకు స్థిరమైన రాబడిని అందిస్తాయి. ఏడాది పొడవునా హెచ్చుతగ్గులను తగ్గించడానికి మీ పోర్ట్‌ఫోలియోలో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి నిష్పత్తి ఉండాలి. లార్జ్ క్యాప్ ఫండ్‌లు తమ ఆస్తులలో కనీసం 80 శాతాన్ని లార్జ్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా వాటిని ఇతర మ్యూచువల్ ఫండ్ వర్గాల కంటే మరింత స్థిరంగా ఉంచుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి