FASTag KYC: ఈరోజే ఆఖరు.. ఆ పని చేయకపోతే సేవలు ఇక బంద్‌.. ఇప్పుడే చెక్ చేసుకోండి..

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఫాస్టాగ్‌ వినియోగదారులకు కీలకమైన రిమైండర్‌ ను జారీ చేసింది. 2024, ఫిబ్రవరి 29లోపు ఫాస్టాగ్‌ కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) అప్‌డేట్‌ను పూర్తి చేయాలని సూచించింది. లేకపోతే ఫాస్టాగ్‌ ఖాతా డీయాక్టివేట్‌ అయిపోయి, బ్లాక్‌ లిస్ట్‌ లోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది. ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వన్‌ వెహికల్‌- వన్‌ ఫాస్టాగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది.

FASTag KYC: ఈరోజే ఆఖరు.. ఆ పని చేయకపోతే సేవలు ఇక బంద్‌.. ఇప్పుడే చెక్ చేసుకోండి..
Fastag

Updated on: Feb 29, 2024 | 7:53 AM

పేటీఎం సేవలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఆంక్షల నేపథ్యంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఫాస్టాగ్‌ వినియోగదారులకు కీలకమైన రిమైండర్‌ ను జారీ చేసింది. 2024, ఫిబ్రవరి 29లోపు ఫాస్టాగ్‌ కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) అప్‌డేట్‌ను పూర్తి చేయాలని సూచించింది. లేకపోతే ఫాస్టాగ్‌ ఖాతా డీయాక్టివేట్‌ అయిపోయి, బ్లాక్‌ లిస్ట్‌ లోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది. ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వన్‌ వెహికల్‌- వన్‌ ఫాస్టాగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ అన్నమాట. దీని వల్ల బహుళ కార్ల కోసం ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం లేదా ఒకే వాహనంతో బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లను అనుసంధానించడం కుదరడం. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్‌ వినియోగదారులు తప్పనిసరిగా ఫిబ్రవరి 29(ఈ రోజు)లోపు తమ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని చెప్పింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయంగా టోల్ చెల్లింపు అనుభవాన్ని అందించడానికి కేవైసీ అప్‌డేట్‌ సకాలంలో చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.

గడువులోగా చేయకపోతే..

మీరు ఫిబ్రవరి 29లోపు మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే, మీ బ్యాంక్ మీ ఖాతా డీయాక్టివేట్ అవ్వొచ్చు లేదా బ్లాక్‌లిస్ట్ చేయవచ్చు. ఫలితంగా టోల్ ప్లాజాల వద్ద మీరు దానిని ఉపయోగించలేకపోవచ్చు. ఇది మీ ప్రయాణాలలో అనవసరమైన ఆలస్యం, అసౌకర్యానికి దారి తీస్తుంది.

ఎలా అప్‌డేట్ చేయాలంటే..

మీ ఫాస్టాగ్‌ కేవైసీని అప్‌డేట్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ. అదెలా అంటే..

ఇవి కూడా చదవండి
  • ఐహెచ్‌ఎంసీఎల్‌ కస్టమర్ పోర్టల్‌ని సందర్శించండి(https://fastag.ihmcl.com)
  • లాగిన్ చేయండి: ధ్రువీకరణ కోసం మీ నమోదిత మొబైల్ నంబర్ ఎంటర్‌ చేసి లాగిన్‌ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ద్వారా లాగిన్‌ చేయండి.
  • మీ ప్రొఫైల్‌ని యాక్సెస్ చేయండి: డాష్‌బోర్డ్ మెనూ నుంచి ఎడమ వైపున ఉన్న “మై ప్రొఫైల్” ఎంచుకోండి.
  • మీ కేవైసీ స్థితిని తనిఖీ చేయండి: మీ ప్రొఫైల్ పేజీలో మీ కేవైసీ స్థితి, రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన ఇతర వివరాలను ప్రదర్శిస్తుంది. వాటిని సరిచూసుకోవాలి.
  • కేవైసీ నవీకరించండి (అవసరమైతే): కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి వెబ్‌సైట్‌లో అందించిన సూచనలను అనుసరించండి.

మీ బ్యాంక్ ద్వారా ఆఫ్‌లైన్లో..

  • మీ పాన్‌ నంబర్‌, ఐడీ రుజువు, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్-సైజ్‌ ఫోటోతో మీ ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంకును సందర్శించండి.
  • ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఫారమ్‌ను అభ్యర్థించండి. అవసరమైన పత్రాలతో సమర్పించండి.
  • కేవైసీ కోసం అవసరమైన పత్రాలు: చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్‌ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)

ఎందుకీ కేవైసీ అప్‌డేట్‌..

బహుళ వాహనాలకు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించకుండా చేయడంతో పాటు నిర్దిష్ట వాహనానికి బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లను లింక్ చేయకుండా నిరోధించడం ఈ ప్రక్రియ ఉద్దేశం. ఇదే విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ ఈ నెల ప్రారంభంలో తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కేవైసీని అప్‌డేట్ చేయడం ద్వారా వారి తాజా ఫాస్టాగ్‌ ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..