Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulletproof Rolls Royce: బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయ్స్ కొన్న అంబానీ కుటుంబం.. ధర, లక్షణాలు తెలిస్తే అదిరిపోతారంతే..!

భారతదేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ తన కార్ల కలెక్షన్స్‌లో మరో సూపర్ కారును యాడ్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీ భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్ కొనుగోలు చేశారు. ముఖ్యంగా లగ్జరీతో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ కారును డిజైన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Bulletproof Rolls Royce: బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయ్స్ కొన్న అంబానీ కుటుంబం.. ధర, లక్షణాలు తెలిస్తే అదిరిపోతారంతే..!
Bulletproof Rolls Royce
Follow us
Srinu

|

Updated on: Feb 07, 2025 | 12:15 PM

అంబానీ కుటుంబానికి భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ల కలెక్షన్ ఉంది. ప్రఖ్యాత జియో గ్యారేజ్‌లో ఈ కార్ల కలెక్షన్‌ను అంబానీ ఫ్యామిలీ మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే కలెక్షన్‌లో ఎన్ని కార్లు ఉన్నాయనేది అధికారికంగా ఎవరికీ తెలియకపోయినా అంబానీ కుటుంబానికి మొత్తంసుమారు 10 రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీలు ఉన్నాయని ఔత్సాహికులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో రోల్స్ రాయిస్ కల్గినన్‌కు సంబంధించిన బేస్ ప్రైస్ రూ. 7.99 కోట్లు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే మీడియా నివేదికల ప్రకారం ముఖ్యంగా ఈ కారు పర్సనల్‌గా డిజైన్ చేయించుకునే అవకాశం ఉండడంతో అంబానీ కుటుంబం తమకు అవసరాలకు అనుగుణంగా బుల్లెట్ ప్రూఫ్ వంటి సౌలభ్యాలు ఈ కారుకు యాడ్ చేశారు. దీంతో ఈ కారు ధర భారీగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంబానీ డిజైన్ చేయించుకున్న కల్గినన్ ధర రూ. 13 కోట్లకు పైగా ఉంటుందని నివేదికల ద్వారా వెల్లడవుతుంది. 

సిల్వర్ కలర్ రోల్స్ రాయిస్ కల్గినన్ కారు మొదట చండీగఢ్ లోని బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్స్ యాడ్ చేసే వర్క్ షాప్‌లో మొదటిసారి కనిపించింది. ఈ కారు అత్యాధునిక భద్రతా లక్షణాలతో వస్తుంది. వీటిలో అధిక- భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆర్మర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అందువ్లల అంబానీ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులకు ఈ స్థాయి భద్రతా ప్రమాణాలు ఉన్న కార్లు సరైన ఎంపికగా మారతాయి. ముఖేష్ అంబానీ రోల్స్ రాయిస్ కల్గినన్ లక్షణాల విషయానికి వస్తే బుల్లెట్ ప్రూఫ్ కల్లినన్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్ వీ12 ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. అందువల్ల ఈ కారు అసాధారణమైన పనితీరును అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ సెల్ఫ్ డిజైన్ మెకానిజయంతో రూపొందించడం వల్ల మృదువైన డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఈ కారులో ఐదుగురు వ్యక్తులు కూర్చునేలా విశాలమైన సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. అంబానీ కుటుంబం తరచుగా మెర్సిడెస్-బెంజ్ ఎస్ 680 గార్డ్ సెడాన్ల వంటి భారీ రక్షణ కలిగిన వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే తాజాగా వచ్చిన రోల్స్ రాయిస్ వారి అభిరుచులకు అనుగుణంగా రూపొందించుకున్నారని నిపుణులు చెబుతున్నారు. 

రోల్స్ రాయిస్‌తో అంబానీ కుటుంబానికి ఉన్న సంబంధం 2019 బలపడింది. ఆ సమయంలో భారతదేశంలో అంబాని మొదటిగా కుల్లినన్ మోడల్‌ను కొనుగోలు చేశారు.  కుల్లినన్ ఎస్‌యూవీ గోదుమ రంగులో ఆకట్టుకునే డిజైన్‌లో ఉంటుంది. ఆ తర్వాత 2021 నుంచి ఫాంటమ్, ఘోస్ట్, టస్కాన్ సన్ కుల్లినన్, బ్లాక్ బ్యాడ్జ్ కుల్లినన్ వంటి అనేక హై- ఎండ్ రోల్స్ రాయిస్ వాహనాలు అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది. 2022లో అంబానీ కుటుంబం తమ వాహన శ్రేణిలో మూడో కలినన్ మోడల్‌ను కొనుగోలు చేశారు.  ఈ కారు ధర రూ.13.14 కోట్లు అని తెలుస్తోంది. ఈ కారు కోసం అంబానీ ఒకేసారి రూ. 20 లక్షల రోడ్ ట్యాక్స్, రూ.40,000 రోడ్ ట్యాక్స్ ఫీజు చెల్లించినట్లు చెబుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్ అతని లగ్జరీ కార్ల సేకరణకు కొత్త ఆకర్షణగా నిలుస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి