Elon Musk Twitter Stake: సోషల్ మీడియాలోకి టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పెట్టుబడులు.. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ దూకుడు..
Elon Musk Twitter Stake: టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎలోన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన నోటిఫికేషన్‌లో ట్విట్టర్ ఈ సమాచారాన్ని..
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్(Elon Musk) మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎలోన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌లో(Twitter) 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన నోటిఫికేషన్‌లో ట్విట్టర్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ప్రీ-మార్కెట్ ట్రేడ్‌లో ట్విట్టర్ షేర్లు 28% వరకు పెరిగాయి. ఎలాన్ మస్క్ మార్చి 14, 2022 నాటికి ట్విట్టర్ ఇన్ లో 9.2 శాతం నిష్క్రియాత్మక వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించారు. ఎలోన్ మస్క్ 73,486,938 సాధారణ స్టాక్‌లను కలిగి ఉన్నారని ట్విట్టర్ ఇన్ వెల్లడించింది. అయితే ఈ మధ్య ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తాను త్వరలో ఓ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ప్రకటించిన వారంలోనే ట్విట్టర్‌లో వాటాలు కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. అంతకుముందు కూడా ట్విట్టర్‌ను వెనుకేసుకొచ్చాడు. ట్విట్టర్ వాక్ స్వేచ్ఛను అనుసరిస్తుందని తాను నమ్ముతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల, ట్విట్టర్‌లో పోల్ ద్వారా ట్విట్టర్ వాక్ స్వాతంత్ర్య సూత్రానికి ఖచ్చితంగా కట్టుబడి ఉందని.. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే విషయమని మీరు భావిస్తున్నారా అని యూజర్లు అడిగారు. వినియోగదారులను తెలివిగా ఓటు వేయాలని మస్క్ కోరాడు. ఈ పోల్ ఫలితాలు చాలా ముఖ్యమైనవని కూడా చెప్పాడు. పోల్‌లో దాదాపు 70 శాతం మంది వినియోగదారులు లేదు అని సమాధానమిచ్చారు.
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. గతంలో ట్విట్టర్‌ను తీవ్రంగా విమర్శించాడు. భావ ప్రకటనా స్వేచ్ఛ సూత్రాలను పాటించడంలో కంపెనీ విఫలమై ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు.
ఈ పోల్ తర్వాత, ఎలోన్ మస్క్ మరో ట్వీట్‌లో ట్విట్టర్ అల్గారిథమ్ ఓపెన్ సోర్స్‌గా ఉండాలని, ప్రతి ఒక్కరూ చూడవచ్చని అన్నారు. దీనికి ట్విట్టర్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే స్పందిస్తూ.. “ట్విటర్ ఏ అల్గారిథమ్‌ను ఉపయోగించాలో లేదా ఉపయోగించకూడదో నిర్ణయించుకోవడం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి: Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..
Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..