TATA EV Scooter: అదిరే మైలేజ్‌తో త్వరలోనే టాటా ఈవీ స్కూటర్‌ లాంచ్‌.. ఇక ఆ కంపెనీలకు చుక్కలే..!

|

Sep 23, 2024 | 7:30 AM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిర్వహణ వ్యయం సహా అనేక కారణాల వల్ల ప్రజలు ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వాడకానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఈవీ స్కూటర్ల ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో సగటు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

TATA EV Scooter: అదిరే మైలేజ్‌తో త్వరలోనే టాటా ఈవీ స్కూటర్‌ లాంచ్‌.. ఇక ఆ కంపెనీలకు చుక్కలే..!
Tata Ev Scooter
Follow us on

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిర్వహణ వ్యయం సహా అనేక కారణాల వల్ల ప్రజలు ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వాడకానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఈవీ స్కూటర్ల ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో సగటు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారికి భారతీయ కంపెనీ అయిన టాటా గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే టాటా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా ఈవీ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

త్వరలో ఈ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు టాటా తెలిపింది. టాటా ప్రకటన నేపథ్యంలో టాటా ఈవీ స్కూటర్‌ ఫీచర్లు ఇవేనంటూ కొన్ని సోషల్‌ మీడియా పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన మోటార్‌తో వస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ఈవీ స్కూటర్‌ పరిధి దాదాపు 270 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా టాటా ఎలక్ట్రిక్ స్కూటర్‌ 3 కేడబ్ల్యూ మోటార్ ద్వారా గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టాటా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, బూట్ అండర్ స్పేస్, సౌకర్యవంతమైన సీటు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే టాటా స్కూటర్‌లోని అంతర్నిర్మిత బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుందని చెబుతున్నారు.  

చాలా మంది ఈవీ ప్రియులు టాటా ఈవీ స్కూటర్‌ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్‌ లాంచ్‌ తేదీపై ఎన్నో అంచనాలు వేసుకుంటున్నారు. ఈ స్కూటర్‌ మరికొన్ని నెలల్లోనే భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉండేలా ఈ స్కూటర్ ధర రూ. 67 వేలకు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి