Tata Harrier EV: ఈవీ మార్కెట్‌లో టాటా సత్తా.. ఆ మోడల్ ఈవీ వెర్షన్ లాంచ్

|

Jun 21, 2024 | 4:08 PM

తాజాగా పెట్రో వాహనాల్లో సక్సెస్ అయిన మోడల్స్‌ను ఈవీ వెర్షన్‌లో రిలీజ్ చేయాలని టాటా కంపెనీ భావిస్తుంది. టాటా కర్వ్, టాటా హారియర్ మోడల్స్‌కు త్వరలోనే ఈవీ వెర్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టాటా హారియర్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుతం పరీక్షలో దశలో ఉన్న నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారును పరీక్షిస్తున్న సమయంలో ఇప్పటికే చాలా మంది స్పాట్ చేశారు.

Tata Harrier EV: ఈవీ మార్కెట్‌లో టాటా సత్తా.. ఆ మోడల్ ఈవీ వెర్షన్ లాంచ్
Tata Harrier Ev
Follow us on

భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో భారతీయ కంపెనీ టాటా మోటర్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో మరింత ముందుకు వెళ్లాలని టాటా మోటార్స్ ప్రణాళికలు రచిస్తుంది. అయితే తాజాగా పెట్రో వాహనాల్లో సక్సెస్ అయిన మోడల్స్‌ను ఈవీ వెర్షన్‌లో రిలీజ్ చేయాలని టాటా కంపెనీ భావిస్తుంది. టాటా కర్వ్, టాటా హారియర్ మోడల్స్‌కు త్వరలోనే ఈవీ వెర్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టాటా హారియర్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుతం పరీక్షలో దశలో ఉన్న నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారును పరీక్షిస్తున్న సమయంలో ఇప్పటికే చాలా మంది స్పాట్ చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే టాటా హారియర్ ఈవీ కోసం టాటా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా హారియర్ ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టాటా హారియర్ ఈవీ ఆటో ఎక్స్పో 2023లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. తర్వాత మళ్లీ భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించారు. అయితే కాన్సెప్ట్ మోడల్ శిలాజ ఇంధనంతో నడిచే హారియర్ నుండి కొన్ని కీలకమైన డిజైన్ తేడాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకు సంబంధించిన ప్రొడక్షన్ వెర్షన్ విలక్షణమైన డిజైన్‌తో వస్తుంది. ముఖ్యంగా హెడ్ ల్యాంప్లు, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్ సరికొత్త డిజైన్‌తో వస్తాయి. టాటా హారియర్ ఎస్‌యూవీ ఐసీఈ వెర్షన్‌తో పోలిస్తే చక్రాలు, వెనుక బంపర్ మొదలైనవి అప్‌డేటెడ్ లుక్‌తో వస్తాయి. ఏరో స్టైలింగ్ డిజైన్‌తో వచ్చే హారియర్ ఈవీ అందరినీ ఆకర్షిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా డిజిటల్ లార్జ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ ఈవీ ప్రత్యేకత. అలాగే హారియర్ ఈవీలో 360 డిగ్రీల సరౌండ్- వ్యూ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఆటోమేటిక్ మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇతర ఫీచర్లతో పాటు వచ్చే ఈ ఈవీ డిజైన్ ఫీచర్లపరంగా మొదటి స్థానంలో ఉంటుంది. 

టాటా హారియర్ ఈవీ ఆటోమేకర్‌కు సంబంధించిన యాక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పని చేస్తుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో బ్రాండ్ నుంచి అనేక ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతునిస్తుంది. టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌ను ఉంచడానికి హారియర్ ఈవీకు సంబంధించిన వెనుక సస్పెన్షన్‌కు కొన్ని పెద్ద మార్పులను చేసింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డ్యూయల్ మోటారు సెటప్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పవర్, టార్క్ అవుట్‌తో పాటు రేంజ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..