Summer Season: త్వరగా వచ్చిన వేసవి.. ఊపు మీద ఉన్న ఏసీ ఫ్రిజ్ అమ్మకాలు.. పెరుగుతున్న ధరలు..

ఎండాకాలం వచ్చేస్తోంది.. కాదు కాదు వచ్చేసింది.. చాలా ముందుగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రతి సీజన్ మారినపుడల్లా అది మన జేబులపై..

Summer Season: త్వరగా వచ్చిన వేసవి.. ఊపు మీద ఉన్న ఏసీ ఫ్రిజ్ అమ్మకాలు.. పెరుగుతున్న ధరలు..
Ac, Fridge Rates
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2023 | 8:49 PM

ఎండాకాలం వచ్చేస్తోంది.. కాదు కాదు వచ్చేసింది.. చాలా ముందుగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రతి సీజన్ మారినపుడల్లా అది మన జేబులపై ప్రభావం చూపిస్తుంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో మన జేబులు ఖాళీ అవుతాయి. శీతాకాలంలో చలిని తట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మనకి ఖర్చులు మోసుకు వస్తాయి. ఇక ఎండాకాలం వచ్చిందంటే.. చల్లదనం కోసం ఏసీలు.. ఫ్రిడ్జ్ లు వాడుకోవడం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం ఒక్కసారిగా ముంచుకొచ్చిన ఎండ వేడిని తప్పించుకోవడం కోసం ప్రజలు ఏసీలు.. ఫ్రిడ్జ్‌లు కొనడంలో బిజీ అయిపోయారు.

ఈ నెలలో ఏసీ-ఫ్రిడ్జ్ అమ్మకాలు 10% కంటే ఎక్కువ పెరిగాయి. శీతల పానీయాలు, పాల పానీయాలు, నీరు, ఐస్ క్రీం కూడా అమ్మకాలలో పెరుగుదల చూపిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన ఈ డిమాండ్‌తో వాటి ధరలు 7-25 శాతం పెరిగాయి. రానున్న నెలల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తిని పెంచడం ప్రారంభించాయి.

వాస్తవానికి దేశంలోని ఉత్తర -పశ్చిమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు చాలా సంవత్సరాలుగా రికార్డు స్థాయిని తాకుతున్నాయి. సాధారణంగా ఇది ఫిబ్రవరిలో జరగదు. మార్చి రెండో వారం నుంచి క్రమేపీ వాతావరణం వేడెక్కుతుంది. కానీ, ఈసారి మాత్రం ఫిబ్రవరి మొదటి వారం నుంచీ అంటే దాదాపు నాలుగు వారాల ముందు నుంచీ ఎండాకాలం వచ్చేసినట్టు సెగలు రేగుతున్నాయి. దీంతో వేసవిలో వాడే ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం మొదలైంది. ఈ కారణంగా ఎల్‌జీ మూడు షిఫ్టుల్లో పని ప్రారంభించింది. గోద్రెజ్ అప్లయెన్సెస్ అలాగే పానాసోనిక్ వంటి కంపెనీలు కూడా AC-ఫ్రిడ్జ్‌ల ఉత్పత్తిని 100% పెంచుతున్నాయి. ఇప్పుడు వేసవి కోసం సిద్ధమవుతున్న కొన్ని కంపెనీల ప్రతినిధులు తమ సన్నాహాలను గురించి ఏమి చెప్పారో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  1. పెప్సికో: ప్రపంచవ్యాప్తంగా పెప్సికో అతిపెద్ద ఫ్రాంఛైజీ అయిన వరుణ్ బెవరేజెస్ గత ఏడాది డిసెంబర్ నుండి ఇన్వెంటరీని పెంచడం ప్రారంభించింది. భారతదేశంలో, కంపెనీ ఇప్పటికే ఉన్న 6 ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో రెండు కొత్త ప్లాంట్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది.
  2. ఎల్‌జీ ఇండియా: ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, వినియోగ వస్తువులకు డిమాండ్ తగ్గలేదని ఎల్ జీ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ కులభూషణ్ భరద్వాజ్ చెప్పారు. ఇదిలా ఉండగా, వేసవి ప్రారంభంలోనే అమ్మకాలు 10% కంటే ఎక్కువ పెరిగాయి. అటువంటి పరిస్థితిలో, తాము ఉత్పత్తిని పెంచడం ప్రారంభించామనీ ఆయన వివరించారు.
  3. గోద్రెజ్ అప్లయెన్సెస్: గత సంవత్సరంతో పోలిస్తే ఈ వేసవిలో అన్ని కూలింగ్ ఉపకరణాల అమ్మకాలు దాదాపు 40% పెరుగుతాయని మేము అంచనా వేస్తున్నామని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు.
  4. పానాసోనిక్: పానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా MD, Fumiyasu Fujimori చెబుతున్న దాని ప్రకారం.. ACలు, ఫ్రిజ్‌ల వంటి కూలింగ్ ఉత్పత్తుల అమ్మకాలు ఏప్రిల్ 2022 నుంచి 35% పెరిగాయి. వేసవి కాలం ముంచుకొస్తున్న కొద్దీ ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
  5. FMCG కంపెనీలు కూడా ఉత్పత్తిని పెంచడం ప్రారంభించాయి ఏసీ-ఫ్రిడ్జ్ వంటి చల్లదనాన్ని ఇచ్చే వస్తువులతో పాటు, FMCG ఉత్పత్తుల ఉత్పత్తిని కూడా పెంచుతున్నారు. కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌లోని విశ్లేషకులు ఒక నోట్‌లో కొన్ని వేసవి వినియోగ ఉత్పత్తులు 2023లో బలమైన అమ్మకాలను చూసే అవకాశం ఉందని చెప్పారు. హిందూస్థాన్ యూనిలీవర్, నెస్లే, ఐటీసీ, స్పెన్సర్స్ రిటైల్ వంటి కంపెనీల విక్రయ దృక్పథం ఆధారంగా ఈ నోట్ రూపొందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!