Stock Market: స్టాక్‌మార్కెట్‌ను వెంటాడుతున్న నష్టాలు.. ఏకంగా 928 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

స్టాక్‌ మార్కెట్‌ను నష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లోనూ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. BSE మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 265.2 లక్షల కోట్ల రూపాయల నుంచి 261.22 లక్షల కోట్ల రూపాయలకు క్షీణించింది.

Stock Market: స్టాక్‌మార్కెట్‌ను వెంటాడుతున్న నష్టాలు.. ఏకంగా 928 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
Stock Market

Updated on: Feb 22, 2023 | 10:02 PM

స్టాక్‌ మార్కెట్‌ను నష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లోనూ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. BSE మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 265.2 లక్షల కోట్ల రూపాయల నుంచి 261.22 లక్షల కోట్ల రూపాయలకు క్షీణించింది. అంటే ఇన్వెస్టర్ల సంపద దాదాపు 3.88 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. BSEలో అన్ని ఇండెక్సులు 2 శాతానికి పైగా పడిపోయాయి. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఒక్క ITC మినహా మిగిలినవన్నీ భారీ నష్టాలు చవిచూశాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఒక్క షేర్‌ ధర పెరిగితే మూడు షేర్ల ధరలు పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 928 పాయింట్లు పతనమైంది. గడిచిన రెండు నెలల్లో ఇది అతి పెద్ద పతనంగా చెప్పవచ్చు. వడ్డీ రేట్ల పెంపు మరింత ఉంటుందనే భయాలు, RBI, ఫెడ్‌ మినిట్స్‌ గురించిన ఆందోళనతో పాటు ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాలను రష్యా అధినేత పుతిన్‌ చేసిన హెచ్చరిక మార్కెట్‌లో కలవరం సృష్టించింది. మొత్తంగా చూస్తే 250 షేర్లు ఇవాళ్టి ట్రేడింగ్‌లో లోయర్‌ సర్క్యూట్‌ తాకాయి. అదానీ గ్రూప్‌కు చెందిన మూడుసార్లు 52 వారాల కనిష్ఠస్థాయికి పడిపోయాయి. మొత్తంగా చూస్తే అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ 8 ట్రిలియన్‌ రూపాయలకు పడిపోయింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక రాకముందే ఈ గ్రూప్‌ కేపిటలైజేషన్‌ 25 ట్రిలియన్‌ రూపాయలు.

మరో వైపు బలహీనపడుతున్న రూపాయి, అదానీ షేర్ల పతనం వంటి వాటితో భారతీయ స్టాక్‌మార్కెట్‌ విలువ తగ్గిపోయింది. మార్కెట్‌ విలువపరంగా ప్రపంచ స్టాక్‌మార్కెట్లలో ఆరోస్థానంలో ఇండియా ఉండగా ఇప్పుడా ఆ స్థానాన్ని ఇంగ్లాండ్‌ ఆక్రమించింది. దాదాపు తొమ్మిది నెలలు ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. స్టాక్‌మార్కెట్‌ పతనానికి ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. అదానీ గ్రూప్‌ వ్యవహారంతో పాటు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలు ఇండియన్‌ స్టాక్‌మార్కెట్‌ను కుదేలు చేస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపు భయం మార్కెట్‌ను హడలెత్తిస్తోంది. అటు పుతిన్‌ ఇచ్చిన వార్నింగ్‌ పెట్టుబడిదారులను భయాందోళనలకు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..