SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(state Bank of India) వద్ద ఖాతాదారులకు శుభవార్త. ఎందుకంటే తమ వద్ద ఆ ఖాతాలు ఉన్న వారికి రూ. 2 లక్షల వరకు ఉచిత ప్రయోజనాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ప్రయోజనాలను కేవలం తమ వద్ద ఉన్న జన్ ధన్ ఖాతాలు(Jan Dhan Account) కలిగి రూపే డెబిట్ కార్డు ఉన్న వారికి మాత్రమేనని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ ఖాతాలు ఉన్న వినియోగదారులకు రెండు లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను ఉచితంగా అందిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ సదుపాయాన్ని అందించేందుకు జన్ ధన్ కింద సదరు ఖాతాదారు ఆగస్టు28, 2018 ముందు లేక తరువాత దానిని ఓపెన్ చేశాడా అనే అంశం మీద ఆదారపడి ఉంటుంది.
ఆగస్టు28, 2018 ముందు ఖాతా తెరిచిన వారికి లక్ష రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది.. పైన తెలిపిన తేదీ తరువాత కొత్తగా ఖాతా తెరిచే వారికి మాత్రం ఈ రూ.2 లక్షల ప్రమాద బీమా వార్తిస్తుంది. ఈ రెండిటిలోనూ ప్రయోజనాలు పొందటానికి రూపే డెబిట్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను కేంద్రం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఖాతాలను అందిస్తోంది. ఈ అకౌంట్ తెరవటానికి కేవలం కేవైసీ నియమాలు పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ ఖాతాలు జీరో బ్యాలెన్స్ తోనూ తెరవవచ్చు.
షరతులు..
అయితే.. ప్రమాద మరణ బీమా ప్రయోజనాలను పొందడానికి కొన్ని నిబంధనలు, షరతులు తప్పనిసరిగా పాటించాలి. ఉదాహరణకు.. జన్ ధన్ ఖాతాదారులు ప్రమాదం జరిగిన తేదీ నుండి 90 రోజుల మునుపు లింక్ చేయబడిన RuPay డెబిట్ కార్డ్‌తో ఇంట్రా లేదా ఇంటర్-బ్యాంక్ రెండింటిలో ఏదైనా ఛానెల్‌లో ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీని విజయవంతంగా నిర్వహించి ఉండాలి.
ఇవీ చదవండి..
Home Loan: హోమ్ లోన్ త్వరగా చెల్లిస్తే వడ్డీ తగ్గుతుందా? పూర్తి వివరాలు..
Stock Market: స్టాక్స్ కొనేటప్పుడు ఇన్వెస్టర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి.. పూర్తి వివరాలు..