SBI: లాకర్ డిపాజిటర్లకు ఎస్బీఐ భారీ షాక్..!

లాకర్ డిపాజిటర్లకు ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ షాక్ ఇచ్చింది. లాకర్ డిపాజిట్లకు ఉన్న కనీస ఛార్జీని రూ.500 నుంచి రూ.2వేల వరకు పెంచింది. అలాగే మీడియం సైజ్ లాకర్ ఛార్జీలు రూ.1000 నుంచి రూ.4వేలు.. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ డిపాజిట్ల కనీస ఛార్జీ రూ.9 వేల రూ.12వేలకు పెంచింది.

SBI: లాకర్ డిపాజిటర్లకు ఎస్బీఐ భారీ షాక్..!
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2020 | 5:08 PM

లాకర్ డిపాజిటర్లకు ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ షాక్ ఇచ్చింది. లాకర్ డిపాజిట్లకు ఉన్న కనీస ఛార్జీని రూ.500 నుంచి రూ.2వేల వరకు పెంచింది. అలాగే మీడియం సైజ్ లాకర్ ఛార్జీలు రూ.1000 నుంచి రూ.4వేలు.. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ డిపాజిట్ల కనీస ఛార్జీ రూ.9 వేల రూ.12వేలకు పెంచింది. ఈ పెరిగిన ఛార్జీలు మార్చి 31నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మెట్రో నగరాలు, పట్టణాల్లో లార్జ్ లాకర్ల అద్దె రూ.2వేల నుంచి రూ.8వేలకు పెరగనున్నాయి. వీరికి జీఎస్టీ ఛార్జీలు అదనంగా పడనున్నాయి.

అయితే ఇంతవరకు తక్కువ ఛార్జీలతో ఎస్బీఐ శాఖలు చిన్న పట్టణాలు, గ్రామాల్లో లాకర్ సర్వీసులను అందిస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు ఈ రేట్లు దాదాపు 33శాతం పెరిగాయి. మరోవైపు ఎస్బీఐ వన్‌-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం మీడియం లాకర్లకు రూ.500తో పాటు జీఎస్టీ.. లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్లకు రూ.1000తో పాటు అదనంగా జీఎస్టీ పడనుంది. లాకర్ ఛార్జీలు చెల్లించకపోతే 40శాతం జరిమానా పడనుంది. కాగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం వినియోగదారులు లాకర్‌ను ఏడాదికి ఒకసారి ఆపరేట్ చేయాలి. లేకపోతే దాన్ని బ్యాంకులు తెరిచే వీలుంది. కానీ తెరిచే ముందు వినియోగదారులకు నోటీసులు పంపుతారు.

Read This Story Also:వరుసగా తొమ్మిదో సారి తగ్గింపు.. మరింత చౌకగా ఎస్‌బీఐ లోన్స్..!