SBI: భారతీయ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేవలను అందిస్తోంది. ప్రైవేటు బ్యాంకుల నుంచి వస్తోన్న పోటీని తట్టుకునే క్రమంలోనే రకరకల సేవలు అందిస్తూ అకౌంట్ హోల్డర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎమ్‌లు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎస్‌బీఐ యూజర్లు సదరు సంస్థ ఏటీఎమ్‌లనే ఎందుకు ఉపయోగించుకోవాలనే విషయమై బ్యాంకు తమ ఖాతాదారులకు ఓ ప్రకటన విడుదల చేసింది. ట్విట్టర్ వేదికగా తమ యూజర్లకు సమచారాన్ని అందిస్తూ.. ‘మీరు కేవలం ఎస్‌బీ ఏటీఎమ్‌నే ఎందుకు ఉపయోగించాలన్న దానికి కారణం. మీ సెక్యూరిటీ పిన్ మార్చుకోవడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోవడంతో పాటు మరెన్నో రకాల సేవలను పూర్తిగా ఉచితంగా పొందొచ్చు’ అంటూ ట్వీట్ చేశారు.
Here’s why you should only visit SBI ATMs! Changing your pin, balance enquiry, mini statements, etc. are free for all SBI customers. #SBIAapkeSaath #DidYouKnow #NilCharges #SBIATM pic.twitter.com/btC1XC3nLG
— State Bank of India (@TheOfficialSBI) July 16, 2021
ఇదిలా ఉంటే ఖాతాదారులను పెద్ద ఎత్తున ఆకట్టుకునే క్రమంలోనే ఎస్‌బీఐ ఇటీవలే మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐలో ఖాతా తెరిస్తే పలు రకాలా లాభాలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా మోదీ సర్కార్ పేదలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అకౌంట్‌లో ఎలాంటి బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదనే విషం తెలిసిందే. ఇక ఈ ఖాతా తెరిచిన వారికి ఉచితంగా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రమాద బీమాలో భాగంగా ఇది వర్తిస్తుంది.
ఇక కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించే క్రమంలో తాజాగా ఎస్‌బీఐ.. ఆన్‌లైన్ సేవలకు సంబంధించి పలు సాంకేతిక మార్పులు చేసింది ఇందులో భాగంగా జులై 16 రాత్రి 0:45 గంటల నుంచి జులై 17 వేకువ జామున 1:15 గంటల వరకు సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనోలైట్, యూపీఐ సేవలకు అంతరాయం కలిగింది.
Also Read: Luxury Car Smuggling Racket: లగ్జరీ కార్లపై సుంకం ఎగవేత వ్యవహారం గుట్టురట్టు.. ఆరు కార్లు స్వాధీనం
Warning: యమ డేంజర్ : ఉపద్రవం ఎంతో దూరం లేదు .. దశ ఆల్రెడీ స్టార్టైపోయిందట. బి కేర్ ఫుల్.!