Katrina Kaif: రెడ్‌ స్విమ్‌ సూట్‌లో అందాల కత్రీనా.. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. సర్‌ప్రైజ్‌ ఫొటో..

Katrina Kaif: 2003లో వచ్చిన 'బూమ్‌' చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార కత్రీనాకైఫ్‌. అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. బాలీవుడ్‌లో...

Katrina Kaif: రెడ్‌ స్విమ్‌ సూట్‌లో అందాల కత్రీనా.. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. సర్‌ప్రైజ్‌ ఫొటో..
Katrina Kaif
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2021 | 9:18 AM

Katrina Kaif: 2003లో వచ్చిన ‘బూమ్‌’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార కత్రీనాకైఫ్‌. అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. బాలీవుడ్‌లో ఉన్న దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఇక బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లరి పిడుగు’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చిన కత్రీనా ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే చేతి నిండా సినిమాలతో అప్‌ కమింగ్‌ హీరోయిన్స్‌కు సైతం పోటీనిస్తోందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే శుక్రవారం ఈ అందాల తార పుట్టిన రోజు. జులై 16తో కత్రీనా 38వ పడిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీతో పాటు ఆమె అభిమానులు సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్నంతా సోషల్‌ మీడియాలో కత్రీనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే తనకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన వారందరికీ కత్రీనా కృతజ్ఞతలు తెలిపింది. స్విమ్మింగ్‌ పూల్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ అందాల తార.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ.. తనపై ప్రేమను చూపిస్తోన్న వారందరికీ ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ జోడించారు కత్రీనా. ఇక ఈ ఫొటోలో కత్రీనా వన్నె తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫొటో చూసిన ఆమె అభిమానులు కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.

కత్రీనా పోస్ట్‌..

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

Also Read: Kartikeya Gummakonda : మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కార్తికేయ.. హీరోయిన్ ఎవరో తెలుసా..

కొడుకు సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టిన కింగ్.. అఖిల్ ఏజెంట్ కోసం రంగంలోకి నాగార్జున

Priyamani: సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పిన ప్రియమణి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!