SBI General Insurance: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ ఆరోగ్య సుప్రీం బీమా పాలసీ.. రూ.5 కోట్ల వరకు బీమా కవరేజ్‌..!

SBI General Insurance: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్ల కోసం సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సెక్టార్‌లోనే కాకుండా ఇన్స్‌రెన్స్‌..

SBI General Insurance: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ ఆరోగ్య సుప్రీం బీమా పాలసీ.. రూ.5 కోట్ల వరకు బీమా కవరేజ్‌..!
Health Insurance Plan

Edited By: Janardhan Veluru

Updated on: Jul 14, 2021 | 2:24 PM

SBI General Insurance: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్ల కోసం సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సెక్టార్‌లోనే కాకుండా ఇన్స్‌రెన్స్‌ సెక్టార్‌లోనూ దూసుకుపోతోంది. కొత్త కొత్త ఇన్స్‌రెన్స్‌ పాలసీలను ప్రవేశపెడుతూ ఇతర సంస్థలకు ధీటుగా రాణిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్.. ​‘ఆరోగ్య సుప్రీం’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది. 20 బేసిక్​ కవరేజీలు, 8 ఆప్షనల్​ కవరేజీలతో సహా పూర్తి ఆరోగ్య బీమా కవరేజీని అందించేలా ఈ పాలసీని రూపొందించింది ఎస్‌బీఐ. ఈ పాలసీ కింద రూ. 5 కోట్ల వరకు బీమా ఆప్షన్లను అందిస్తుంది. కస్టమర్​ అవసరాలు, కవరేజీ ఫీచర్స్​ ఆధారంగా ప్రో, ప్లస్, ప్రీమియం అనే మూడు ఆప్షన్లలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సమ్ ఇన్సూర్డ్ రీఫిల్, రికవరీ బెనిఫిట్ వంటి కస్టమర్ ఫ్రెండ్లీ ఒప్పందాల్లో భాగంగా 1 నుంచి 3 ఏళ్ల వరకు పాలసీ వ్యవధి ఎంచుకునే సౌకర్యం కల్పిస్తుంది. ఖాతాదారులు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా త‌మ అనువైన ప్లాన్‌ను ఎంచుకోవ‌చ్చు.

ఆరోగ్య సుప్రీం ప్లాన్​ ప్రయోజనాలివే..

అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇన్సూరెన్స్‌ పాలసీలకు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. అధిక సంఖ్యలో ఆరోగ్య బీమా పాలసీలు చేసుకుంటున్నారు. గతంలో పాలసీల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. కోవిడ్‌ తర్వాత పాలసీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తన కస్టమర్లకు వివిధ రకాల ఇన్సురెన్స్‌ పాలసీలను అందిస్తోంది. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రీమియం ధరలను కూడా భారీగా పెంచాయి. బీమా పాలసీ సంస్థలు. దీంతో టర్మ్​ ఇన్సూరెన్స్​తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండి & సిఈఓ పిసి కాండ్పాల్ మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమాకు ప్రాధాన్యత పెరిగింది. కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి బీమా అవసరం ఏమిటో తెలిసి వచ్చింది. దీంతో చాలా మంది పాలసీలు చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సుప్రీం, సమగ్ర ఆరోగ్య బీమా పథకాలను ప్రారంభించాము. వినియోగదారులు వారి అవసరాలకు తగ్గట్లు ప్రీమియం, పదవీకాలం ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పారు.

కరోనాతో తెలిసొచ్చిన పాలసీల ప్రాముఖ్యత

కాగా, కరోనా కేసుల పెరుగుదలతో అందరికీ ఆరోగ్య బీమాతో భద్రత ప్రాముఖ్యత తెలిసొచ్చింది. దీంతో ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టినట్లు ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్​ పేర్కొంది. ఈ ఆరోగ్య సుప్రీం హెల్త్ పాలసీలో అనేక రీఫిల్ ఫీచర్లను అందించింది. ఈ ఫీచర్ వినియోగదారునికి ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ పాలసీ ప్రధానంగా రిటైల్ కస్టమర్లకు బహుళ ప్రయోజనాలు, కవరేజీలను అందిస్తుందని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ పాలసీ కంపెనీలు రకరకాల పాలసీలను అందిస్తున్నాయి.

 

ఇవీ కూడా చదవండి

Business Idea: మంచి బిజినెస్ ఐడియా.. ఈ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు..!

SBI Warning : ఎస్బీఐ హెచ్చరిక..! ఈ లింక్‌లపై అప్రమత్తంగా ఉండండి.. లేదంటే అకౌంట్ ఖాళీ అవుతుంది..

PAN Card: మీ వద్ద ఉన్న పాన్‌ కార్డు నిజమైనదా..? నకిలీదా..? సులభంగా తెలుసుకోండి ఇలా..?