AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: తిరుగులేని బిజినెస్ ఇది.. నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు.. ఎలాగంటే

ఫుడ్ ట్రక్స్, ఫుడ్ స్టాల్స్ లాంటివి ఇప్పుడు చాలామంది ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కాలేజీలు, ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ ఫుడ్ ట్రక్స్ ప్రారంభిస్తే.. అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఆ వివరాలు

Business Ideas: తిరుగులేని బిజినెస్ ఇది.. నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు.. ఎలాగంటే
Money
Ravi Kiran
|

Updated on: Apr 13, 2025 | 12:30 PM

Share

ఉద్యోగం ఎంత పెద్దదైనా కూడా.. చేసేవాళ్లను ఉద్యోగి అనే అంటారు. అలాగే వ్యాపారం చిన్నదా.. పెద్దదా అనేది ఏం లేదు.. వారిని యజమాని అనే అంటారు. ఇది మన పెద్దలు చెప్పే సామెత. ఒకప్పుడు యువత ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలంటే.. ఎలా స్టార్ట్ చేస్తాం.. చేశామే అనుకో.. లాభం కన్నా నష్టం వస్తే అప్పుడేం పరిస్థితి అంటూ తర్జన భర్జన అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తమ తెలివితో పాటు క్రియేటివిటీకి కూడా పదునుపెట్టి.. కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే వ్యాపారాలను మొదలుపెట్టేస్తున్నారు. కేవలం రూ. 50 వేల నుంచి రూ. 75 వేల పెట్టుబడితో.. మాంచి లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్‌లు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ బిజినెస్ మనం దేశంలో ఎప్పుడూ ప్రాఫిట్‌లోనే కొనసాగుతుంది. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే బిజినెస్‌లలో ఫుడ్ బిజినెస్ ఒకటి.

ఫుడ్ ట్రక్స్, ఫుడ్ స్టాల్స్ లాంటివి ఇప్పుడు చాలామంది ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కాలేజీలు, ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ ఫుడ్ ట్రక్స్ ప్రారంభిస్తే.. అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఇలాంటి ఫుడ్ ట్రక్కు ఏర్పాటు చేయడం వల్ల మీరు ఎలాంటి కిరాయి కట్టాల్సిన పని ఉండదు. వచ్చే డబ్బుల్లో.. ముడిసరుకుకు పోగా మిగిలిన లాభం మన దగ్గరే ఉంటుంది. ఇక ఈ ఫుడ్ ట్రక్కు ఏర్పాటు చేయడానికి మొదటిగా మీకు మాంచి కండిషన్‌లో ఉండే ట్రక్కు అవసరం పడుతుంది. మాములుగా ట్రక్కు కొనాలన్నా.. లేదా ఫుడ్ ట్రక్కుగా మార్చుకోవలన్నా.. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు కావచ్చు. అయితే మీకు తెలుసున్నవారు ఎవరైనా ఉంటే.. వారి దగ్గర నుంచి లీజుగా ట్రక్కు తీసుకుని.. రూ. 50 వేల నుంచి రూ. 75 వేల చిన్నపాటి డబ్బుతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి.

మీరు ఈ కాలేజీలు, స్కూల్స్, ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో.. ఈ ఫుడ్ ట్రక్కు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు.. అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫుడ్ బిజినెస్ ఎక్కడైనా కూడా మాంచి గిరాకీగా ఉంటుంది. మనం దీనినే సిటీలలో కూడా చూసే ఉంటాం. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ కరెక్ట్‌గా మెయింటెన్ చేస్తే.. మన బిజినెస్ కొద్దిరోజుల్లో వృద్ది చెందుతుంది. ముడిసరుకుకు అయ్యే ఖర్చు పోనూ.. రోజుకు రూ. 3 వేల నుంచి 5 వేల వరకు లాభం రావచ్చు. అంటే నెలకు రూ. 90 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్