AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: త్వరపడండి.! సామాన్యుల కోసం పోర్టబుల్ ఏసీలు.. స్విచ్ నొక్కితే చలితో వణికిపోవాల్సిందే

ద్దె ఇంట్లో ఉండేవారికి మాత్రం ఇదొక పెద్ద సమస్యే అని చెప్పొచ్చు. గోడకు ఏసీ ఫిక్స్ చేయాలంటే చాలు.. అద్దెకుంటున్న వారికి, ఇంటి యజమాని మధ్య వాగ్వాదం జరగాల్సిందే. కొంతమంది ఇంటి యజమానులైతే.. ఏసీ కోసం గోడకు రంధ్రాలు కొట్టించేందుకు అస్సలు అంగీకరించరు.

Portable AC: త్వరపడండి.! సామాన్యుల కోసం పోర్టబుల్ ఏసీలు.. స్విచ్ నొక్కితే చలితో వణికిపోవాల్సిందే
Portable Acs
Ravi Kiran
|

Updated on: Apr 13, 2025 | 12:47 PM

Share

పేద, ధనిక అనేదానితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఏసీ అనేది సర్వసాధారణమైపోయింది. సొంతంగా ఇల్లు ఉన్నవారికైతే.. ఇది ఓకే.. అదే అద్దె ఇంట్లో ఉండేవారికి మాత్రం ఇదొక పెద్ద సమస్యే అని చెప్పొచ్చు. గోడకు ఏసీ ఫిక్స్ చేయాలంటే చాలు.. అద్దెకుంటున్న వారికి, ఇంటి యజమాని మధ్య వాగ్వాదం జరగాల్సిందే. కొంతమంది ఇంటి యజమానులైతే.. ఏసీ కోసం గోడకు రంధ్రాలు కొట్టించేందుకు అస్సలు అంగీకరించరు. అందుకే ఇలాంటి సామాన్యుల కోసం మార్కెట్‌లోకి కొత్త తరహ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్. వీటి కోసం ఏ గోడ పగలగొట్టాల్సిన పన్లేదు. ఇంటిలో ఎక్కడ పెట్టినా చాలు.. క్షణాల్లో ఇల్లంతా చల్లదనాన్ని అందిస్తుంది. కూలర్ లాంటి పరిమాణంలో ఉండే వీటిని.. పోర్టబుల్ ఏసీలని అంటారు. ఇవి మాంచి కూలింగ్ ఇల్లంతా అందిస్తాయి. వీటిని మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.. ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లవచ్చు.

అడ్జస్టబుల్ పైపు‌లైన్‌తో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీలు వేడి గాలిని బయటకు పంపించి.. ఇంట్లో చల్లదనాన్ని క్షణాల్లో అందిస్తుంది. ఈ పోర్టబుల్ ఏసీలలో కూడా ఇతర గోడ ఏసీల మాదిరిగానే 1 టన్, 1.5 టన్ లేదా 2 టన్ ఉంటాయి. మార్కెట్‌లో ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలు పోర్టబుల్ ఏసీలను లాంచ్ చేశాయి. కాగా, 1 టన్ పోర్టబుల్ ఏసీ రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఉండగా.. అదే 2 టన్ పోర్టబుల్ ఏసీ అయితే రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..