Monthly Pension: రూ.5292 సిప్ చేస్తే.. నెలకు రూ.1.50 లక్షల పెన్షన్‌ పొందవచ్చు..!

Monthly Pension Plan: మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్ మార్కెట్‌లో నేరుగా డబ్బులు పెట్టలేని వారు మ్యూచువల్ ఫండ్స్ (MF)..

Monthly Pension: రూ.5292 సిప్ చేస్తే.. నెలకు రూ.1.50 లక్షల పెన్షన్‌ పొందవచ్చు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 09, 2021 | 12:39 PM

Monthly Pension Plan: మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్ మార్కెట్‌లో నేరుగా డబ్బులు పెట్టలేని వారు మ్యూచువల్ ఫండ్స్ (MF) ద్వారా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడుతుంటారు. అయితే ఇక్కడ కూడా రిస్క్ ఉంటుందని గమనించాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి కాకుండా సిప్ రూపంలో డబ్బులు పెట్టుబడి పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది. దీని SIP వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. 35 ఏళ్ల వయసులో ఉన్న వారు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.1.5 లక్షల వరకు పొందాలని భావిస్తే.. నెలకు రూ.5292 సిప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 10 శాతం యాన్వల్ స్టెప్ అప్ ఆప్షన్ ఎంచుకోవాలి.

35 ఏళ్ల వయసులో ఉన్న వారి నెలవారీ ఖర్చులు ఇప్పుడు రూ.40 వేలు ఉంటే.. 60 ఏళ్లు వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం ప్రకారం పరిశీలిస్తే.. నెలకు దాదాపు రూ.1.4 లక్షల వరకు కావాల్సి వస్తుంది. ఈ డబ్బులు పొందాలంటే రూ.2.08 కోట్లు డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు నెలకు రూ.1.4 లక్షల నుంచి రూ.1.5 లక్షలు సిస్టమ్యాటివ్ విత్‌డ్రాయెల్ ప్లాన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.

35 ఏళ్ల వయసులో నెలకు రూ.5292 ఇన్వెస్ట్‌ చేస్తే..

ఇక 35 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.5292 సిప్ చేస్తే.. అలాగే ప్రతి ఏడాది 10 శాతం స్టెప్ అప్ ఆప్షన్ ఎంచుకుంటే.. 25 ఏళ్ల తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.2.08 అవుతుంది. ఇక్కడ వార్షిక రాబడిని 12 శాతంగా పరిగణలోకి తీసుకున్నాము. మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, ఎడిల్‌వీజ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, యాక్సిస్ ఫోకస్డ్ 25 ఫండ్, డీఎస్‌పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ వంటి వాటిల్లో రిటైర్మెంట్ ఫండ్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Home Loan: ఈ బ్యాంకులు 35 సంవత్సరాల కాల పరిమితితో తక్కువ వడ్డీకే గృహ రుణాలు.. పూర్తి వివరాలు

CoWIN App: కోవిన్ పోర్టల్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా.. అందులో ఏముంటుంది!