Business Idea: రూ. 5 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 70వేల ఆదాయం.. సిరులు కురిపించే ఐడియా..

|

Nov 16, 2023 | 4:55 PM

సాధారణంగా ఎన్నో రకాల బ్యాంకులు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏటీఎమ్‌లను సదరు బ్యాంకులే ఏర్పాటు చేస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ బ్యాంకులకు చెందిన ఏటీఎమ్‌లను ఇన్‌స్టాల్‌ చేయడానికి కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. సదరు కాంట్రాక్టర్లు వివిధ ప్రదేశాల్లో ఏటీఎమ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. భారత దేశంలో ఏటీఎమ్‌లను పెట్టడానికి మెజారిటీ బ్యాంకులు...

Business Idea: రూ. 5 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 70వేల ఆదాయం.. సిరులు కురిపించే ఐడియా..
Business Idea
Follow us on

తక్కువ పెట్టుబడి, అది కూడా సింగిల్‌ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే చాలు ప్రతీనెల ఆదాయం పొందే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.? ఇలాంటి వ్యాపారం చేయడానికి ప్రతీ ఒక్కరూ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇలాంటి వ్యాపారాలు చాలా కొన్నే ఉంటాయి. ఇలాంటి వాటిలో ఏటీఎమ్‌ ఫ్రాంచైజ్‌ ఒకటి. తక్కువ పెట్టుబడితో నెలకు సుమారు రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉన్న ఈ బిజినెస్‌ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఎన్నో రకాల బ్యాంకులు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏటీఎమ్‌లను సదరు బ్యాంకులే ఏర్పాటు చేస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ బ్యాంకులకు చెందిన ఏటీఎమ్‌లను ఇన్‌స్టాల్‌ చేయడానికి కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. సదరు కాంట్రాక్టర్లు వివిధ ప్రదేశాల్లో ఏటీఎమ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. భారత దేశంలో ఏటీఎమ్‌లను పెట్టడానికి మెజారిటీ బ్యాంకులు ఇండిక్యాష్‌, ముత్తూట్, ఇండియా వన్‌ ఏటీఎమ్‌లతో ఒప్పందాలు చేసుకున్నాయి.

ఏటీఎమ్‌ ఫ్రాంచైజీని పొందడానికి మీకు కచ్చితంగా 50 నుంచి 80 చదరపడు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలం కావాలి. ఈ స్థలం ఇతర ఏటీఎమ్‌ల నుంచి కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. విద్యుత్‌ సరఫరా నిరంతరం అందుబాటులో ఉండాలి. కనీసం 1కేడబ్ల్యూ విద్యుత్ కనెక్షన్ ఉండాలి. క్యాబిన్ కాంక్రీట్ రూఫింగ్, సిమెంట్ ఇటుకలతో కూడిన శాశ్వత భవనం ఉండాలి. ఇక ఫ్రాంచైజీకి దరఖాస్తు చేసుకోవడానికి.. ఐడీ ప్రూఫ్‌ – ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. రెసిడెంట్‌ అడ్రస్‌ కోసం రేషన్‌ కార్డు, విద్యుత్ బిల్లు ఉండాలి. బ్యాంక్‌ పాస్‌ బుక్‌ ఉండాలి. ఫోటోగ్రాఫ్, ఈ-మెయిల్ ID, ఫోన్ నంబర్, జీఎస్‌టీ నెంబర్‌ కచ్చితంగా ఉండాలి.

ఎంత ఆదాయం వస్తుందంటే..

ఏటీఎమ్‌ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసే సమయంలో మీరు మొత్తం రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో రూ. 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంటుంది. ఇది మళ్లీ తిరిగి పొందొచ్చు రూ. 3 లక్షలు నిర్వహణ మూలధనంగా చెల్లించమని అడుగుతారు. ఇక లాభం విషయానికొస్తే.. ఏటీఎమ్‌లో ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ. 8, బ్యాలెన్స్‌ చెకింగ్‌కు రూ. 2 కమిషన్‌ వస్తుంది. దీనిబట్టి కనీసం నెలకు రూ. 60 నుంచి రూ. 70 వేలు సంపాదించుకోవచ్చు.

నోట్‌: ఏటీఎమ్‌ ఫ్రాంచైజీల పేరుతో కొందరు నేరగాళ్లు డబ్బులు వసూలు చేసిన సంఘటనలు జరిగాయి. కాబట్టి వీటి గురించి ఎంక్వైరీ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..