Ather Energy: ఏథర్ స్కూటర్లపై అదిరే ఆఫర్లు.. ఏకంగా రూ. 24,000 వరకూ తగ్గింపు.. పూర్తి వివరాలు
ఇటీవల ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఏథర్ ఎనర్జీ కూడా కొత్త స్కీమ్స్ ను ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ డిసెంబర్ పేరిట ఈ ఆఫర్లను అందిస్తోంది. ఏథర్ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఏథర్ 450ఎక్స్, 450ఎస్ స్కూటర్లపై రూ. 24,000 వరకూ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మరికొన్ని రోజుల్లో క్యాలెండర్ మారిపోతోంది. 2023 గుడ్ బై చెప్పి.. 2024 కు స్వాగతం పలుకబోతున్నాం. ఈ సమయంలో చాలా మంది ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఇయర్ ఎండింగ్ సేల్స్ అంటూ ప్రత్యేకమైన డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇటీవల ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఏథర్ ఎనర్జీ కూడా కొత్త స్కీమ్స్ ను ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ డిసెంబర్ పేరిట ఈ ఆఫర్లను అందిస్తోంది. ఏథర్ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఏథర్ 450ఎక్స్, 450ఎస్ స్కూటర్లపై రూ. 24,000 వరకూ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏథర్ ఎనర్జీ డిసెంబర్ ఆఫర్స్..
ఏథర్ ఎనర్జీ డిసెంబర్ పేరిట ఈ ప్రత్యేకమైన ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. మొత్తం రూ. 24,000 వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. అందులో రూ. 6,500 డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో రూ. 5000 తగ్గింపు కాగా.. మరో రూ. 1,500 కార్పొరేట్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాక పలు అదనపు ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 5.99శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. జీరో డౌన్ పేమెంట్ తో 60 నెలల్లో ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.
అదనపు ప్రయోజనాలు..
పైన పేర్కొన్న ప్రయోజనాలు మాత్రమే కాక అదనంగా ఏథర్ బ్యాటరీ పై రూ. 7000 విలువైన ఏథర్ బ్యాటరీ ప్రోటెక్ట్ ప్లాన్ ను పొందొచ్చు. ఈ ప్యాకేజ్ లో బ్యాటరీకి ఐదేళ్లు లేదా 60,000కిలోమీటర్ల వరకూ సంరక్షణ ఉంటుంది. అంతేకాక 70శాతం స్టేట్ ఆఫ్ హెల్త్(ఎస్ఓహెచ్) గ్యారెంటీ స్కీమ్ ఉంటుంది.
మరో కొత్త బండి..
ఏథర్ ఎనర్జీ ఇప్పుడు కొత్తగా మరో స్కూటర్ ను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏథర్ 450ఎక్స్ అపెక్స్ పేరిట కొత్త టాప్ ఎండ్ వెర్షన్ ను తీసుకురానుంది. ఈ స్కూటర్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 2,500 టోకెన్ అమౌంట్ తో స్కూటర్ ను కొనుగోలు చేయొచ్చు. 450ఎక్స్ అపెక్స్ స్కూటర్లు మార్చి 2024లో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన టీజర్ కూడా ఇటీవల కంపెనీ విడుదల చేసింది. ఈ 450ఎక్స్ అపెక్స్ ప్రస్తుతం ఉన్న 450ఎక్స్ స్కూటర్ కన్నా వేగంగా వెళ్లుంది. అందుకోసం కొత్త రైడింగ్ మోడ్ ను తీసుకొచ్చారు. వార్ప్ ప్లస్ పేరిట ఈ కొత్త మోడ్ పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం ఏథర్ స్కూటర్లో ఉన్న వార్ప్ స్థానాన్ని రిప్లేస్ చేస్తుంది.
ఈ టీజర్ లో మరో అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అదేమిటంటే రైడర్ ఎక్కువగా బ్రేకులను వినియోగించాల్సిన అవసరం ఉండదని వివరించారు. అంటే బ్రేక్ రీజనరేషన్ మల్టీ లెవల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఓలా ఎస్1, టీవీఎస్ ఐ క్యూబ్ స్కూటర్లకు పోటీగా కొత్త ఫ్యామిలీ స్కూటర్ ను కూడా తీసుకొచ్చేందుకు ఏథర్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2024లోనే ఈ స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








