EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ స్కీమ్.. ఎన్ని లక్షలంటే..?

| Edited By: Ram Naramaneni

Aug 11, 2024 | 10:07 PM

భారతదేశంలోని ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగస్తులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కోసం కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ ఈపీఎఫ్ఓ పథకంలో ఉద్యోగుల కోసం అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందని చాలా మందికి తెలియదు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈపీఎఫ్‌ పథకంలో జమ చేసే సభ్యులకు 7 లక్షల వరకు బీమా అందుబాటులో ఉంటుంది.

EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ స్కీమ్.. ఎన్ని లక్షలంటే..?
Epfo
Follow us on

భారతదేశంలోని ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగస్తులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కోసం కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ ఈపీఎఫ్ఓ పథకంలో ఉద్యోగుల కోసం అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందని చాలా మందికి తెలియదు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈపీఎఫ్‌ పథకంలో జమ చేసే సభ్యులకు 7 లక్షల వరకు బీమా అందుబాటులో ఉంటుంది. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) స్కీమ్ అంటారు. రూ.15,000లోపు బేసిక శాలరీ ఉన్న ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. అయితే సభ్యుని బేసిక్ శాలరీ రూ.15,000 కంటే ఎక్కువ ఉంటే బీమా గరిష్ట ప్రయోజనం రూ.6 లక్షలుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్ఐ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలు

  • ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ బీమా కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఈడీఎల్ఐ స్కీమ్ కింద క్లెయిమ్ మొత్తం మునుపటి 12 నెలల సగటు నెలవారీ చెల్లింపు కంటే 35 రెట్లు గరిష్టంగా రూ. 7 లక్షల వరకు ఉంటుంది.
  • అలాగే ఈ పథకం కింద రూ. 1,50,000 బోనస్ ఇస్తారు. ఏప్రిల్ 28, 2021 నుంచి బోనస్ రూ.1.75 లక్షలకు పెంచారు.
  • అన్ని ఈడీఎల్ఐసీ లెక్కింపునకు బేసిక్ పేకి డియర్‌నెస్ అలవెన్స్ తప్పనిసరిగా వర్తింపజేయాలి.
  • అయితే ఉద్యోగులందరికీ రూ. 7 లక్షల క్లెయిమ్ మొత్తం లభించదు. ఇది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు. 

ఈడీఎల్ఐ లెక్కింపు ఇలా

ఈడీఎల్ఐ బీమా మొత్తం గత 12 నెలల ప్రాథమిక జీతం, డీఏపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజ్ కోసం క్లెయిమ్ చివరి ప్రాథమిక జీతం + డీఏ కంటే 35 రెట్లు ఉంటుంది. ఇది కాకుండా రూ. 1,75,000 వరకు బోనస్ మొత్తం కూడా క్లెయిమ్‌దారుకు చెల్లిస్తారు. ఉదాహరణకు గత 12 నెలల ఉద్యోగి ప్రాథమిక జీతం + డీఏ రూ. 15,000 అయితే, బీమా క్లెయిమ్ మొత్తం (35 x 15,000) + 1,75,000 కలిపి రూ. 7,00,000 అవుతుంది.

క్లెయిమ్ చేయడం ఇలా

ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ మరణిస్తే అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడు బీమా కవరేజీని క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం నామినీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. దీని కంటే తక్కువగా ఉంటే అతని తరపున తల్లిదండ్రులు క్లెయిమ్ చేయవచ్చు. క్లెయిమ్ చేస్తున్నప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలు అవసరం అవుతాయి. మైనర్ గార్డియన్ తరపున క్లెయిమ్ చేస్తే మాత్రం సంరక్షక ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ వివరాలను అందిచాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..