Simple One Scooter: ఒక్కసారి ఛార్జితో 300+ కిమీ ప్రయాణం.. దుమ్ము రేపుతున్న ఈ-స్కూటర్.. 

Simple One Scooter: సింపుల్ ఎనర్జీ(Simple energy) ఎలక్ట్రిక్ వాహన సంస్థ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ కోసం అదనపు బ్యాటరీ ప్యాక్(additional Battery Pack) ఎంపికను ప్రారంభించింది.

Simple One Scooter: ఒక్కసారి ఛార్జితో 300+ కిమీ ప్రయాణం.. దుమ్ము రేపుతున్న ఈ-స్కూటర్.. 
Simple One
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 01, 2022 | 1:45 PM

Simple One Scooter: సింపుల్ ఎనర్జీ(Simple energy) ఎలక్ట్రిక్ వాహన సంస్థ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ కోసం అదనపు బ్యాటరీ ప్యాక్(additional Battery Pack) ఎంపికను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఒకే ఛార్జ్‌పై 300కు పైగా కిమీ ప్రయాణ పరిధిని అందిస్తుంది. వీటి డెలివరీ జూన్‌లో ప్రారంభం కానున్నాయి. చివరిగా చెల్లింపు సమయంలో వాహన కొనుగోలు దారులు అదనపు బ్యాటరీ ప్యాక్ ను కావాలంటే ఎంచుకోవచ్చు. అదనపు బ్యాటరీ ఆప్షన్ వాహనదారులకు ప్రయాణ రేంజ్ విషయంలో ఆందోళనను తగ్గించనుంది. ఈ అదనపు బ్యాటరీ వల్ల ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

1.6 kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ సింపుల్ వన్ వాహనం 300 కంటే ఎక్కువ మైలేజ్ అందించనుంది. ఇది ఇంతకు ముందు స్కూటర్ అందిస్తున్న 235 కిమీ ప్రామాణిక కాన్ఫిగరేషన్ కంటే అధికం. అదనపు బ్యాటరీతో కూడిన సింపుల్ వస్ వాహన ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.50 లక్షలుగా ఉంది. అదే వినియోగదారుడు అదనపు బ్యాటరీ వద్దనుకుంటే.. వాహన ధర రూ. 1.10 లక్షలుగా ఉండనుందని కంపెనీ వెల్లడించింది. సింపుల్ వన్ స్కూటర్ ను తమ అధికారికి వెబ్ సైట్ www. simpleenergy.in ద్వారా బుక్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం కంపెనీ తెలిపిన దాని ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్ 300 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వటం అన్నది టూవీలర్ ఈవీ ఇండస్ట్రీలోనే అత్యధికమైనదని కంపెనీ సీఈవో సుహాస్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు అదనంగా ఇచ్చే బ్యాటరీ స్కూటర్ లోని బూట్ భాగంలో ఉంటుందని దానివల్ల వాహనదారునికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన వెల్లడించారు.

Also read..

Stock Market: షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక గమనించండి..

Smart Mobile: మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..