Silver Price on April 29th 2021: బంగారం ధరలు బారీగా తగ్గి.. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇక అదే బాటలో వెండి కూడా నడిచింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న వెండి ధరలు మాత్రం పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సిల్వర్ రేట్స్ దిగోచ్చాయి. దీంతో దేశీయ మార్కెట్లో వెండి ధరలలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.678 ఉండగా.. కిలో ధర రూ. 67,800గా ఉంది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా ఇదే పద్దతి కనిపించింది. 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.735 ఉండగా.. కేజీ ధర రూ.73,500గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.735 ఉండగా.. కేజీ ధర రూ.73,500గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.678 ఉండగా.. కేజీ రేట్ రూ.67,800గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల ధర రూ.678 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.67,800గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల ధర రూ.735 ఉండగా.. కిలో ధర రూ.73,500కు చేరింది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.678 ఉండగా.. కేజీ ధర రూ.67,800కు చేరింది. ఇక అటు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు తగ్గింది.
Also Read: ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?
Corona symptoms: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా ? .. అయితే మీ గొంతులో ఈ మార్పులను గమనించండి…