Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాలలో కిలో సిల్వర్ రేట్ ఎంతంటే..?
Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి
Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి ఈ రోజు కొంచెం ఆశాజనకంగా ఉంది. దేశీయ మార్కెట్లో వెండి ధరలలో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదివారం ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.70,400 ఉండగా..10 గ్రాముల ధర రూ. 704 కి చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు కింది విధంగా ఉన్నాయి.
ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 656 ఉండగా.. కేజీ ధర రూ. 65,600కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 704 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 70400కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 656 ఉండగా.. కేజీ ధర రూ. 65600కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 704 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 70400కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 704 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 70400కు చేరింది.
ఇక బంగారం ధరలు.. ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,750ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,910కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,700కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,250కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,220కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,420కు చేరింది.