Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. భారీగా తగ్గిన సిల్వర్ రేట్లు.. ప్రధాన నగరాల్లో

Latest Silver Price: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే..

Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. భారీగా తగ్గిన సిల్వర్ రేట్లు.. ప్రధాన నగరాల్లో
Silver Price Today

Latest Silver Price: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. తాజాగా గురువారం వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.67,100 లుగా ఉంది. కిలో వెండిపై రూ.1300 మేర తగ్గింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.62,700 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,700 లుగా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.67,600 లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.62,700 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.62,700 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.67,600 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,600 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలో వెండి ధర రూ.67,600 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.67,600 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

BSNL రీఛార్జ్ ప్లాన్‌లు.. సంవత్సరం కంటే ఎక్కువ వ్యాలిడిటీ.. అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్‌..

Click on your DTH Provider to Add TV9 Telugu