Silver Price Today: వెండి కూడా బంగారంలో బాటలోని ప్రయాణిస్తోంది. గత వారం రోజుల్లో పలు సార్లు పెరుగుతూ వచ్చిన సిల్వర్ ధరలకు సోమవారం బ్రేక్ పడింది. ఆదివారం ఢిల్లీలో కిలో వెండిపై రూ. 500 పెరగ్గా సోమవారం మాత్రం మార్పు కనిపించలేదు. ఇక నేడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఓసారి తెలుసుకుందాం.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం మాత్రం రూ. 500 పెరిగింది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ సోమవారం వెండి ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక్కడ కూడా కిలో వెండి ధర రూ. 69,300గా నమోదైంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోనూ సోమవారం ధర పెరగకపోయినప్పటికీ ఉత్తరాదితో పోలీస్తే ఇక్కడ వెండి ధర ఎక్కువగానే ఉంది. చెన్నైలో సోమవారం కిలో వెండి ధర రూ. 74,100గా ఉంది. ఇక శనివారంతో పోలిస్తే ఆదివారం ఇక్కడ కిలో వెండిపై రూ. 700 పెరిగింది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు కిలో వెండి రూ. 69,300గా ఉంది.
* ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి ధర ఎక్కువగా ఉంది. సోమవారం భాగ్యనగరంలో కిలో వెండి రూ. 74,100గా నమోదైంది.
* విజయవాడలోనూ వెండి ధరల్లో మార్పులు కనిపించలేదు ఇక్కక కూడా కిలో వెండి ధర రూ. 74,100 వద్ద కొనసాగుతోంది.
* ఇక సాగర నగరం విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 74,100గా నమోదైంది.
Also Read: Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. సోమవారం దేశవ్యాప్తంగా తులం గోల్డ్ ఎంతుందంటే..
Garlic Farming : వెల్లుల్లి సాగుతో అధిక లాభాలు..! ఇలా చేస్తే మంచి దిగుబడి మీ సొంతం..