AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BNPL: రూపాయి లేకపోయినా షాపింగ్ చాన్స్.. బై నౌ పే లేటర్‌తో ఉపయోగాలెన్నో..!

ఇంటి అవసరాలు, వ్యక్తిగత పనులకు ఉపయోగపడే వస్తువులను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ముందుగా దాని ధర ఎంతో తెలుసుకుంటాం. ఆ డబ్బులను పట్టుకుని షాపునకు వెళ్లి కొనుగోలు చేస్తాం. సమయానికి మన దగ్గర సరిపడినంత డబ్బు లేకపోతే అప్పు తీసుకుంటాం. లేకపోతే డబ్బులు సమకూరే వరకూ ఆ వస్తువు కొనుగోలును వాయిదా వేస్తాం. అయితే ఇదంతా పాత పద్దతి. ఆధునిక వ్యాపార రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మీ చేతిలో డబ్బులు లేకపోయినా మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీని కోసం బై నౌ పే లేటర్ (బీఎన్పీఎల్) అనే విధానం అమలవుతోంది. దీని ద్వారా నచ్చిన వస్తువును కొనుగోలు చేసి, డబ్బులను ప్రతి నెలా ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు.

BNPL: రూపాయి లేకపోయినా షాపింగ్ చాన్స్.. బై నౌ పే లేటర్‌తో ఉపయోగాలెన్నో..!
shopping
Nikhil
|

Updated on: Mar 07, 2025 | 4:30 PM

Share

వస్తువులను కొనుగోలు చేయడానికి ఒకే సారి పెద్దమొత్తంలో డబ్బులను ఖర్చుచేయలేని వారికి బీఎన్పీల్ విధానం చక్కగా సరిపోతుంది. వివిధ కంపెనీలు తమ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం వీటిని అందజేస్తాయి. వడ్డీ లేని వాయిదాలు, సులభ ఈఎంఐలు, తక్కువ కాలంలో చెల్లించే అవకాశం ఉండడంతో ఈ విధానం ఎంతో ప్రాచుర్యం పొందింది. కొనుగోలుదారులు ముందుగా బీఎన్పీఎల్ ప్రొవైడర్ ను ఎంపిక చేసుకుని, 3 నుంచి 12 నెలల వ్యవధితో ఈఎంఐలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు ఇ-కామర్స్ యాప్ లు బీఎన్ఫీఎల్ సౌకర్యం కల్పిస్తున్నాయి.

అమెజాన్ పే లేటర్

అమెజాన్ లో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు, డబ్బులను ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉంది. మీకు మూడు నుంచి 12 నెలల కాలవ్యవధిలో ఈఎంఐ ఎంపికలు చేసుకోవచ్చు. అలాగా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కంపెనీ అందజేస్తోంది.

ఫ్లిప్ కార్ట్ పే లేటర్

ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు జరిపిన వారికి పే లేటర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక్కడ దాదాపు 48 నెలల వరకూ ఈఎంఐ ఎంపిక చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐసీఐసీఐ పే లేటర్

ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారుల కోసం స్పల్పకాలిక వడ్డీ లేని క్రెడిట్ రుణాలను అందజేస్తోంది. మీ అర్హత ఆధారంగా పే లేటర్ నుంచి రూ.7500 నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకోవచ్చు.

జెఫ్ట్ మనీ

క్రెడిట్ కార్డు లేకపోయినా జెఫ్ట్ మనీ యాప్ ను ఉపయోగించి షాపింగ్ చేయవచ్చు. దాదాపు రూ.2 లక్షల వరకూ షాపింగ్ చేేసే అవకాశం ఉంది. మూడు నుంచి 12 నెలల ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.

సింపుల్

సింపుల్ యాప్ ద్వారా ఈఎంఐ ఎంపికలు అందుబాటులో లేవు, అయితే నెలాఖరును వివిధ వస్తువుల కొనుగోళ్లకు అనుమతి ఇస్తుంది. ఆ మొత్తాన్ని మూడు నెలల లోపు చెల్లించవచ్చు.

లేజీ పే

లేజీ పే యాప్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ కొనుగోళ్లు జరపొచ్చు. మీ చెల్లింపులను 15 రోజులకు ఒక్కసారి సెటిల్ చేయవచ్చు. అలాగే 3,6,9,12 నెలల ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

బై నౌ పే లేటర్ విధానంలో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ముందుగా కొంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన దాన్ని వాయిదాల రూపంలో కట్టవచ్చు. ఉదాహరణకు రూ.30 వేల వస్తువును కొనాలనుకుంటే డౌన్ పేమెంట్ గా రూ.3 వేలు చెల్లించాలి. మిగిలిన దాన్ని నెలవారీ వాయిదాల రూపంలో కట్టవచ్చు. అయితే అన్ని బీఎన్ఫీఎల్ ప్రొవైడర్లు డౌన్ పేమెంట్ అడగకపోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి