Gold Buying: భారతీయుల రూటు ఛేంజ్‌.. ఆ పని కోసమే 40% మంది బంగారం కొంటున్నారట.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు!

Gold Buying: ఒకప్పుడు కేవలం పెళ్లిళ్లు, పండుగలకే పరిమితమైన బంగారం కొనుగోలు, ఇప్పుడు ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే ఆయుధంగా మారింది. ఇప్పుడు పసిడి కేవలం లాకర్లలో దాచుకునే వస్తువు మాత్రమే కాదు. లాభాలను తెచ్చిపెట్టే పెట్టుబడి మార్గమని భారతీయులు బలంగా నమ్ముతున్నారు..

Gold Buying: భారతీయుల రూటు ఛేంజ్‌.. ఆ పని కోసమే 40% మంది బంగారం కొంటున్నారట.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు!
Gold Buying

Updated on: Apr 28, 2026 | 10:35 AM

Indians Gold Buying: భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. గత కొన్నేళ్లుగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, భారతీయుల్లో బంగారం పట్ల ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. అయితే, బంగారం కొనుగోలు చేసే విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు వచ్చిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పెట్టుబడి వైపే మొగ్గు:

డొమెస్టిక్ రేటింగ్ ఏజెన్సీ CareEdge నివేదిక ప్రకారం.. భారతీయులు ఇప్పుడు బంగారాన్ని అలంకరణ కోసం కంటే, పెట్టుబడి (Investment) సాధనంగానే ఎక్కువగా చూస్తున్నారు. 2025లో మొత్తం బంగారం కొనుగోళ్లలో ఆభరణాల వాటా 60 శాతానికి పడిపోయింది. గతంలో ఇది సగటున 70 శాతంగా ఉండేది. అంటే, ప్రజలు నగలు చేయించుకోవడం తగ్గించి, భవిష్యత్తు అవసరాల కోసం పసిడిని నిల్వ చేసుకుంటున్నారు.

40 శాతానికి చేరనున్న ఇన్వెస్ట్‌మెంట్ వాటా:

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నాటికి మొత్తం పసిడి వినియోగంలో పెట్టుబడి వాటా 35 నుండి 40 శాతానికి చేరుకోవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి

గోల్డ్ ETFలు (Exchange Traded Funds): బంగారు బిస్కెట్లు మరియు నాణేల కొనుగోళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారాన్ని ఒక ‘సురక్షితమైన పెట్టుబడి’గా ప్రజలు భావించడమే దీనికి ప్రధాన కారణం.

ధరలు తగ్గవా?

కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఇకపై కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని ఏజెన్సీ డైరెక్టర్ అఖిల్ గోయల్ అభిప్రాయపడ్డారు. 2025లో ఆభరణాల డిమాండ్ విలువ పరంగా 10 శాతం పెరిగి రూ. 4.8 లక్షల కోట్లకు చేరుకున్నప్పటికీ, పరిమాణం పరంగా చూస్తే పెట్టుబడి కోణమే బలంగా కనిపిస్తోంది.

ఒకప్పుడు కేవలం పెళ్లిళ్లు, పండుగలకే పరిమితమైన బంగారం కొనుగోలు, ఇప్పుడు ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే ఆయుధంగా మారింది. ఇప్పుడు పసిడి కేవలం లాకర్లలో దాచుకునే వస్తువు మాత్రమే కాదు. లాభాలను తెచ్చిపెట్టే పెట్టుబడి మార్గమని భారతీయులు బలంగా నమ్ముతున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా పతనం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us