AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 0.87 శాతం పడిపోయిన నిఫ్టీ బ్యాంక్..

వరుసగా మూడో రోజు స్టాక్‌ మార్కెట్లు(Stock Market) నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం(Inflation) పెరగడంతో దేశీయ సూచీలు అస్థిరతకు గురయ్యాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయి 6.95 శాతానికి చేరుకుంది...

Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 0.87 శాతం పడిపోయిన నిఫ్టీ బ్యాంక్..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Apr 13, 2022 | 4:38 PM

Share

వరుసగా మూడో రోజు స్టాక్‌ మార్కెట్లు(Stock Market) నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం(Inflation) పెరగడంతో దేశీయ సూచీలు అస్థిరతకు గురయ్యాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయి 6.95 శాతానికి చేరుకుంది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 30 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం 30 షేర్ల బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 58,339 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 17,476 వద్ద స్థిరపడింది. రేపు అంబేడ్కర్‌ జయంతి, ఎల్లుండి గుడ్‌ప్రైడే ఆ తర్వాత శని, ఆదివారాలు రావడంతో స్టాక్ మార్కెట్లు తిరిగి ఏప్రిల్ 18 ఓపెన్‌ కానున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.03 శాతం క్షీణించిగా.. స్మాల్ క్యాప్ 0.19 శాతం పెరగిగాయి. నిఫ్టీ బ్యాంక్ 0.87, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.87 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఆటో 0.84 శాతం వరకు పడిపోయింది.

మారుతీ 2.28 పడిపోయి రూ. 7,445 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్ నష్టాల్లో ముగిశాయి. 1,547 కంపెనీల షేర్లు క్షీణించగా, 1,852 కంపెనీల షేర్లు పెరిగాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ లూజర్‌లలో ఉన్నాయి. ఐటీసీ, సన్‌ఫార్మా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌లు లాభాల్లో స్థిరపడ్డాయి.క్యూ4 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించాయి. కంపెనీ లాభాలు టీసీఎస్‌ను మించి ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో నిఫ్టీలో షేర్‌ ధర 9.55 (0.55%) లాభపడి రూ.1751 వద్ద ముగిసింది.

Read Also.. LPG Price: భారత్‌లోనే గ్యాస్ ధర అత్యధికం.. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ రేట్లల్లో ఎన్నో స్థానంలో ఉన్నామంటే..?