Infosys Q4 Results: భారీగా పెరిగిన ఇన్ఫోసిస్ లాభాలు.. టీసీఎస్‌ కంటే మెరుగైన వృద్ధి నమోదు..

భారత్‌లో రెండో-అతిపెద్ద IT కంపెనీ అయిన ఇన్ఫోసిస్(Infosys) కంపెనీ త్రైమాసిక ఫలితాలు(Q4 results) విడుదల చేసింది. కంపెనీ మార్చి 2022తో ముగిసిన నాల్గో త్రైమాసికానికి రూ.5,686 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది...

Infosys Q4 Results: భారీగా పెరిగిన ఇన్ఫోసిస్ లాభాలు.. టీసీఎస్‌ కంటే మెరుగైన వృద్ధి నమోదు..
Infosys
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 13, 2022 | 6:31 PM

భారత్‌లో రెండో-అతిపెద్ద IT కంపెనీ అయిన ఇన్ఫోసిస్(Infosys) కంపెనీ త్రైమాసిక ఫలితాలు(Q4 results) విడుదల చేసింది. కంపెనీ మార్చి 2022తో ముగిసిన నాల్గో త్రైమాసికానికి రూ.5,686 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీ ఏడాది క్రితం ఇదే కాలంలో రూ. 5,076 కోట్ల పన్ను తర్వాత ఏకీకృత లాభాన్ని(కన్సాలిడెటెడ్ ప్రాఫిట్స్) నమోదు చేసింది. కంపెనీ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం 2022 చివరి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌కు ఆదాయం 23 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.32,276 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే వృద్ధి 1 శాతంగా ఉంది. సప్లై సైడ్ ఛాలెంజ్‌లు అదేవిధంగా అధిక వీసా ఖర్చులు కంపెనీకి మార్జిన్‌లను తగ్గించాయి.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయాలు రూ. 26,311 కోట్లుగా నివేదించింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో దీని ఆదాయాలు రూ. 31,867 కోట్లుగా ఉన్నాయి. పూర్తి సంవత్సర కాలానికి (ఏప్రిల్-మార్చి 2022), ఏకీకృత లాభం రూ. 22,110 కోట్లుగా నమోదైంది, ఇది కంపెనీ 2021 ఆర్ధిక సంవత్సరానికి ప్రకటించిన రూ. 19,351 కోట్ల లాభం కంటే 14 శాతం వృద్ధి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఐటీ సెక్టార్‌లో క్లయింట్ల వ్యవహార ధోరణి మారింది. దీర్ఘకాలిక ఒప్పందాల కంటే తక్కువ వ్యవధిలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం చిన్న డీల్స్ వైపే అవి మొగ్గుతున్నాయి. అయినప్పటికీ ఇన్ఫోసిస్ స్థిరమైన పనితీరును కనబరిచింది.

కాగా, ఇప్పటికే టీసీఎస్ కూడా తన Q4 FY22 ఫలితాలు ప్రకటించింది. కంపెనీ ఆదాయం 16% వృద్ధి చెందింది. కంపెనీ ఆదాయం రూ.50,591 కోట్లకు చేరుకుంది. కంపెనీ త్రైమాసిక ఆదాయం తొలిసారిగా 50 వేల కోట్ల మార్కును దాటింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.43,706 కోట్లుగా ఉంది. టీసీఎస్‌ 15.9 వృద్ధిని నమోదు చేయగా ఇన్ఫోసిస్‌ 20.3 శాతం వృద్దిని నమోదు చేసింది. టీసీఎస్‌ కంటే 4.4 శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది.

Read  Also.. Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 0.87 శాతం పడిపోయిన నిఫ్టీ బ్యాంక్..