Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌..!

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 315 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభాలతో నమోదు అయ్యాయి. అయితే అంతర్జాతీయ..

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌..!

Updated on: Feb 15, 2022 | 10:46 AM

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 315 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభాలతో నమోదు అయ్యాయి. అయితే అంతర్జాతీయ సంకేతాల మధ్య సోమవారం భారీ నష్టాలను ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) మంగళవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ (Sensex) 315 పాయింట్ల లాభంతో 56,721 వద్ద, నిఫ్టీ (Nifty) 128 పాయింట్లు లాభపడి 16,970.80వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు నిన్న స్వల్ప నష్టాలతో ముగియగా, ఆసియా సూచీకలు ఈ రోజు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

కాగా, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, రష్యా-ఉక్రెయిన్‌ వంటి వివాదాల నేపథ్యంలో నేడు మదుపర్లు దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్టాల సూచీకలకు ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తల నుంచి ఉత్పన్నమయ్యే భయాలతో మార్కరెట్లు, బాండ్లు, ముడి బంగారం స్థిరంగా మారాయి. భారత స్టాక్‌ మార్కెట్‌, ఖరీదైన విలువతో సెన్సెక్స్‌ 3 శాతం క్షీణించడంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు అత్యధింకగా సరిదిద్దుకున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ చేస్తున్నాయి. తమ బలగాలు ఉక్రెయిన్‌పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా ప్రభుత్వం రష్యాను హెచ్చరించింది.

గ్లోబల్ క్రూడ్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ మంగళవారం బ్యారెల్‌కు 0.61 శాతం పడిపోయి USD 95.89కి చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం మూలధన మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

Google: జాక్‌పాట్‌ కొట్టేశాడు.. గూగుల్‌ నుంచి రూ.65 కోట్ల రివార్డు.. ఎందుకో తెలుసా..?

Post Office: ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు.. పెట్టుబడి సురక్షితం.. పోస్టాఫీసులో FD ఖాతాను ఇలా తెరవవచ్చు..