భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఓ వైపు కరోనా.. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు..

దేశీ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 1800 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ మొదలైన మార్కెట్ల.. ఆ తర్వాత క్రమక్రమంగా కుప్పకూలుతూ.. 2700 పాయింట్లకు పడిపోయాయి. ఉదయం 11:47 సమయంలో సూచీలు 2,516 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 33,175వద్ద, 764 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 9,695 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. దాదాపు అన్ని ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ల ప్రారంభంలో తొలి నిమిషంలోనే.. ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లను నష్టపోగా.. 11.00 గంటల […]

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఓ వైపు కరోనా.. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు..
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 12:47 PM

దేశీ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 1800 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ మొదలైన మార్కెట్ల.. ఆ తర్వాత క్రమక్రమంగా కుప్పకూలుతూ.. 2700 పాయింట్లకు పడిపోయాయి. ఉదయం 11:47 సమయంలో సూచీలు 2,516 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 33,175వద్ద, 764 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 9,695 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. దాదాపు అన్ని ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ల ప్రారంభంలో తొలి నిమిషంలోనే.. ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లను నష్టపోగా.. 11.00 గంటల సమయానికి ఆ నష్టం రూ.11 లక్షల కోట్లు దాటిపోయింది. ఇదే విధంగా నష్టాలను చివచూస్తే.. కాసేపు ట్రేడింగ్‌ను నిలిపేసే అవకాశం ఉందంటున్న మార్కెట్ నిపుణులు.

కరోనా ఎఫెక్ట్..

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాల ప్రజల్నే కాదు.. మార్కెట్లను కూడా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 దేశాల ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ చూపుతున్నట్లు బుధవారం WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకటించింది.

ట్రంప్ స్టేట్‌మెంట్..

ఓ వైపు కరోనా ప్రభావం మార్కెట్లపై చూపిస్తుండగా.. మరోవైపు అమెరికా ట్రేడింగ్ ఇండెక్స్ కూడా మార్కెట్లపై బాగా చూపిస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో డోజోన్స్ 5.8శాతం పడిపోయి 1,464 పాయింట్లు నష్టపోయింది. ఇక నాస్‌డాక్‌ 4.7శాతం, ఎస్‌అండ్‌పీ500 సూచీ 4శాతానికి పైగా నష్టపోయాయి. అమెరికా మార్కెట్ల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ ప్రయాణాలను బ్యాన్ చేయడంతో.. మార్కెట్లు మరింత బేజారయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ట్రంప్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది.