AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సికింద్రాబాద్ – విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్.. 3 గంటలు ఆలస్యంగా బయల్దేరనున్న రైలు

తెలుగురాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక సూచనలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయల్దేరాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా సాయత్రం 6 గంటలకు వెళ్లనుందని స్పష్టం చేసింది.

సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్.. 3 గంటలు ఆలస్యంగా బయల్దేరనున్న రైలు
Train 20834 Rescheduled
Anand T
|

Updated on: Sep 11, 2026 | 1:56 PM

Share

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. శుక్రవారం సెప్టెంబర్ 11, 2026 రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన రైలు వేళల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది.

ప్రయాణికులు ముఖ్య గమనిక

సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 20834 నెంబర్ గల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా మధ్యాహ్నం 03:00 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉండగా.. ఈ రైలుకు సంబంధించిన పెయిరింగ్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్న కారణంగా.. అది సాయంత్రం 18:00 గంటలకు (6:00 PM) రీషెడ్యూల్ చేయబడిందని పేర్కొన్నారు.

3 గంటలు ఆలస్యంగా బయల్దేరనున్న ట్రైన్

అంటే ఈ ట్రైన్ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వెళ్తొందని తెలిపారు. కాబట్టి ఈ ట్రైన్‌లో వెల్లే ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణ ప్రణాళికలు చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us