AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ రెడు తేదీల్లో యథావిధిగా బ్యాంకు సేవలు.. కారణం ఇదే..

బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. జనవరి 30, 31 తేదీల్లో జరగాల్సిన సమ్మె వాయిదా పడింది.

SBI: బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ రెడు తేదీల్లో యథావిధిగా బ్యాంకు సేవలు.. కారణం ఇదే..
SBI
Sanjay Kasula
|

Updated on: Jan 29, 2023 | 1:39 PM

Share

బ్యాంక్ సమ్మెకు సంబంధించి పెద్ద వార్త తెరపైకి వచ్చింది. ఉద్యోగుల తరుపున జనవరి 30, 31 తేదీల్లో జరగాల్సిన సమ్మె తాత్కాలికం వాయిదా పడింది.  కేంద్ర స్థాయిలో ఐదు రోజుల వారం పాటు ఇతర అంశాలపై చర్చించిన తర్వాత సమ్మెను రద్దు చేసుకున్నారు. శనివారం ముంబైలో జరిగిన సమావేశంలో సమ్మె వాయిదా పడింది. సమ్మే రద్దు చేసుకుంటున్నట్లుగా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ఈ రోజుల్లో బ్యాంకుల పనితీరు సాధారణ రోజుల మాదిరిగానే కొనసాగుతుందని తెలిపారు. జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు యూనియన్ల సమ్మె జరగాల్సి ఉంది. ఈ విషయమై గతంలో ప్రదర్శనలు కూడా నిర్వహించాయి ఉద్యోగ సంఘాలు. యాజమాన్యంతో శుక్రవారం జరిగిన చర్చలు సానుకూలం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డీఎన్ త్రివేది తెలిపారు. దీని తర్వాత 30, 31 తేదీల్లో బ్యాంకులు మూతపడవని ప్రకటించారు.

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు ఏంటి?

ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు 5 డిమాండ్లు ఉన్నాయి. బ్యాంకింగ్, పెన్షన్ అప్‌డేట్ చేయాలి, అనేక పాత సమస్యలు, NPS రద్దు చేయాలి, జీతాలు సవరించాలి, అన్ని కేడర్‌లలో రిక్రూట్‌మెంట్ చేయాలి.

బ్యాంకు ఉద్యోగుల ఐదు డిమాండ్లు ఏంటి?

  • ఐదు రోజుల్లో బ్యాంకింగ్ పనులు పూర్తి చేయాలి.
  • పెన్షన్‌ను అప్‌డేట్‌ చేయాలి.
  • ఎన్‌పీఎస్‌ రద్దు చేయాలి.
  • జీతం పెంపుపై కూడా చర్చలు జరగాలి.
  • అన్ని కేడర్లలో నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం