SBI KYC: కేవైసీ చేయకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్‌ చేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా? ఎస్‌బీఐ ఏం చెబుతోంది

|

May 28, 2021 | 1:41 PM

SBI KYC: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉండి కేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లేకపోతే మీ అకౌంట్‌ నిలిచిపోయే అవకాశం ఉంది..

SBI KYC: కేవైసీ చేయకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్‌ చేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా? ఎస్‌బీఐ ఏం చెబుతోంది
State Bank Of India
Follow us on

SBI KYC: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉండి కేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లేకపోతే మీ అకౌంట్‌ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్‌బీఐ ఎన్నో సార్లు కస్టమర్లకు అలర్ట్ చేస్తూ వస్తోంది. 2021 మే 31 లోగా కస్టమర్లు అందరూ కేవైసీ అప్‌డేట్ చేయాలని కోరింది. అయితే ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరగాళ్లు కస్టమర్లకు రకరకాల మెసేజ్ లు సోషల్‌ మీడియాలో, మొబైళ్లకు పంపుతున్నారు. కేవైసీ చేయకపోతే 24 గంటల్లో మీ అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందని హెచ్చరిస్తున్న మెసేజ్‌లు వైరల్‌ అవుతున్నాయి. అలాంటి మెసేజ్‌లను నమ్మవద్దని ఎస్‌బీఐ  హెచ్చరిస్తోంది. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో పొందలేరని రకరకాల మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అందుకు కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కూడా ఇస్తున్నారు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే మీరు నేరగాళ్లు ఉచ్చులో పడినట్లే. జాగ్రత్తగా ఉండాలంటూ ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది. అయితే కేవైసీ అప్‌డేట్‌ కోసం మే 31 వరకు గడువు ఇచ్చింది బ్యాంకు. అప్పటిలోగా మీరు కేవైసీ చేసుకోకపోతే చేసుకోండి. మీ అకౌంట్‌ లావాదేవీలు సక్రమంగా కొనసాగాలంటే వెంటన కేవైసీ చేసుకోవడం బెటర్‌. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కస్టమర్లు తమ హోమ్ బ్రాంచ్‌లో మాత్రమే కాదు దగ్గరలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కూడా కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయవచ్చు. అంతేకాదు.. ఇంటి నుంచి కూడా కేవైసీ అప్‌డేట్ చేయవచ్చు. అలాగే మీ నెట్‌బ్యాంకింగ్‌ పాస్‌వర్డులు కూడా మార్చుకోవాలని, ఎవరైనా మీ బ్యాంకు అకౌంట్‌ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరిస్తోంది.

అయితే కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకుకు వెళ్లి కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవడం కష్టమే. కస్టమర్లు పోస్ట్ లేదా ఇమెయిల్ ద్వారా తమ కేవైసీ వివరాలను బ్యాంకుకు పంపొచ్చు. కస్టమర్లు సంబంధిత డాక్యుమెంట్స్‌ని బ్యాంకుకు పంపితే సరిపోతుంది. కేవైసీ అప్‌డేట్ అయిన తర్వాత కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. గతంలో బ్రాంచ్‌లో మాత్రమే కైవైసీ వివరాలు అప్‌డేట్ చేసే అవకాశం ఉండేది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పోస్ట్ లేదా ఇమెయిల్ ద్వారా కేవైసీ డాక్యుమెంట్స్ పంపొచ్చని ఎస్‌బీఐ ప్రకటించింది. అంతేకాదు ఇంటి దగ్గరే ఉండి మొబైల్‌ ద్వారా కూడా చేసుకోవచ్చు.

 

 

ఇవీ కూడా చదవండి:

Flipkart Home Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ స్మార్ట్‌ ఫోన్‌పై ఏకంగా రూ.50 వేల డిస్కౌంట్‌

Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు.. తక్కువ వివరాలతో కార్డు జారీ