SBI Chocolate Scheme: ప్రతి నెల ఇంటింటికి చాక్లెట్లు.. ఎస్‌బీఐ అదిరిపోయే రికవరీ స్కీం..
SBI New Initiative: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), రుణగ్రహీతలు, ముఖ్యంగా రిటైల్ కస్టమర్‌లు ఈఎంఐలను సకాలంలో చెల్లించేలా ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. నెలవారీ వాయిదాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన చెల్లిస్తారు అనుకేవారికి చాక్లెట్‌లను పంపుతున్నట్లు బ్యాంక్ తెలిపింది.

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా.. బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా.. తిరిగి చెల్లించడంలో జాప్యం చేస్తున్నారా.. అయితే, మీ ఇంటికి వచ్చి చాక్లట్లు పంపించేందుకు రెడీ అవుతోంది దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవును.. మీరు చదవినది నిజం. బ్యాంకు ఖాతాదారులతో గాంధీగిరి చేసేందుకు సిద్ధమవుతోంది. చాక్లెట్ తీసుకుని ఈఎంఐ చెల్లించడం అంటూ గుర్తు చేస్తుంది. మీలో మార్పును కోరుకుంటోంది బ్యాంకు. అసలు విషయం ఏంటో ఇక చదవండి.
మీరు కూడా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కస్టమర్ అయితే.. బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లయితే.. మీరు ఏ ఈఎంఐని మరిచిపోకుండా చూసుకోండి. లేకుంటే బ్యాంక్ ఇప్పుడు మీ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేసింది. ఈ పథకం నెలవారీ చెల్లింపును కట్టకపోవచ్చు అనుకునేవారికి ఉద్దేశించి ఈ పథకంను తీసుకొచ్చింది. ఇప్పుడు వారికి వాయిదాలు సకాలంలో చెల్లించేలా బ్యాంకు కొత్త ప్లాన్‌ను రూపొందించింది.
ఈఎంఐ చెల్లింపులో జాప్యం చేసే రుణగ్రహీతలు బ్యాంక్ గుర్తు చేసిన తర్వాత కూడా స్పందించరు. అలాంటివారిని గుర్తించడం.. గుర్తించినవారి ఇంటిని సందర్శించడం మంచి ఎంపిక అని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. వడ్డీ రేట్ల పెరుగుదల మధ్య రిటైల్ రుణ పంపిణీ కూడా పెరుగుతోంది. మెరుగైన రుణ రికవరీ లక్ష్యంతో ఈ చర్య తీసుకుంటోంది బ్యాంకు.
జూన్ 2023 త్రైమాసికంలో ఎస్‌బీఐ రిటైల్ రుణాల కేటాయింపు 16.46 శాతం పెరిగి రూ.12,04,279 కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.10,34,111 కోట్లుగా ఉంది. బ్యాంకు మొత్తం రుణ ఖాతా 13.9 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరింది.
అలాంటి కస్టమర్లకు చాక్లెట్లు అందించడం..
ఈ పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా ప్రత్యేకమైనది. ఇందులో, ఖాతాదారుడు సకాలంలో చెల్లింపు చేయడం లేదని బ్యాంకు భావిస్తే.. బ్యాంకు అతని ఇంటికి చాక్లెట్లను పంపుతుంది. ఈఎంఐ చెల్లించని కస్టమర్ తరచుగా బ్యాంక్ రిమైండర్ కాల్‌లకు స్పందించడం లేదని బ్యాంక్ తెలిపింది. నిర్దిష్ట కస్టమర్ చెల్లింపు చేయకూడదని అనుకుంటున్నట్లుగా బ్యాంకు అనుకుంటుంది. అటువంటి పరిస్థితిలో వారి ఇంటి వద్దకు నేరుగా ఓ చాక్లెట్ ఇవ్వడం ద్వారా చెల్లింపు చేయమని బ్యాంకు వారికి గుర్తు చేస్తుంది.
తిరిగి చెల్లింపును మెరుగుపరచడానికి ప్రయత్నాలు
ఎస్‌బీఐ ఈ ప్రచారం బ్యాంకింగ్ పరిశ్రమలో రిటైల్ రుణాలు పెరిగిన సమయంలో తీసుకొచ్చింది. రిటైల్ రుణాల పెరుగుదలతో.. నెలవారీ ఈఎంఐ డిఫాల్ట్ కేసులు కూడా పెరిగాయి. అన్ని బ్యాంకులు ఈఎంఐ, తిరిగి చెల్లింపు కోసం అనేక రకాల ప్రచారాలను నడుపుతున్నాయి. ఎస్‌బీఐ ఈ చాక్లెట్ పథకం మెరుగైన రికవరీని నిర్ధారించే ప్రయత్నం కూడా.
బ్యాంకుల రిటైల్ రుణాలు బాగా..
ఎస్‌బీఐ విషయానికొస్తే.. జూన్ 2023 త్రైమాసికంలో రిటైల్ రుణాలు రూ.12,04,279 కోట్లకు పెరిగాయి. ఇది ఏడాది క్రితం అంటే జూన్ 2022 త్రైమాసికంలో రూ.10,34,111 కోట్లు. ఈ విధంగా చూస్తే ఒక్క ఏడాదిలో బ్యాంకు రిటైల్ రుణాలు 16.46 శాతం పెరిగాయి. జూన్ 2023లో ఎస్‌బీఐ మొత్తం రుణం రూ. 33,03,731 కోట్లు. ఈ విధంగా, రిటైల్ రుణాలు ఇప్పుడు బ్యాంకు లోన్ బుక్‌లో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి.
బ్యాంకు ప్రయోగం ఇంకా కొనసాగుతోంది
ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్, రిస్క్, కంప్లైయన్స్, స్ట్రెస్‌డ్ అసెట్స్ ఇన్‌ఛార్జ్ అశ్విని కుమార్ తివారీ మాట్లాడుతూ.. బ్యాంక్ ఈ ప్రచారం ఇంకా పైలట్ దశలోనే ఉందని చెప్పారు. ఎస్‌బీఐ దీన్ని 10-15 రోజుల క్రితమే ప్రారంభించింది. అయితే ప్రారంభ స్పందన చాలా బాగుంది. ఈ ప్రచారం కారణంగా సేకరణ మెరుగుపడుతోంది. ప్రయోగాత్మక దశలో మంచి ఫలితాలు వస్తే పెద్దఎత్తున దత్తత తీసుకోవచ్చని తెలిపారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం