Samsung Galaxy A14 5G: అద్దిరిపోయే ఫీచర్లతో విడుదలైన సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్.. ధర, కెమెరా, ఫీచర్ల వివరాలు మీ కోసం..

|

Jan 26, 2023 | 5:12 PM

కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ.. కస్టమర్ల అంచనాలకు ధీటుగా, విన్నూతనంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను అందించడంలో Samsung ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో అందరూ..

Samsung Galaxy A14 5G: అద్దిరిపోయే ఫీచర్లతో విడుదలైన సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్.. ధర, కెమెరా, ఫీచర్ల వివరాలు మీ కోసం..
Samsung Galazy A14 5g
Follow us on

Samsung Galaxy A14 5G: కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ.. కస్టమర్ల అంచనాలకు ధీటుగా, విన్నూతనంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను అందించడంలో Samsung ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నSamsung Galaxy A14 5G మోడల్‌కను లాంచ్‌ చేసింది సామ్సంగ్ కంపెనీ. ఈ Samsung Galaxy A14 5G ధర, ఫీచర్స్ వంటి వివరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 202 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్‌పై పని చేస్తుంది. ఇందులో 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన 6.6 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది.

ఇంకా ఈ Samsung Galaxy A14 5G గ్యాడ్జెట్లో ఎక్సినోస్ 1330 ఆక్టా- కోర్ ప్రాసెసర్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో కూడిన 16జీబీ ర్యామ్ ఉండటం దీనిలోని ప్రత్యేకత. ర్యామ్ ప్లస్ ఫీచర్ కారణంగా.. అదనంగా వర్చువల్ ర్యామ్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ Samsung Galaxy A14 5G హ్యాండ్‌సెట్‌లో. అలాగే Samsung Galaxy A14 5G లో ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా కస్టమర్లు బ్లాక్చెయిన్ టెక్నాలజీ సాయంతో ఇతర గెలాక్సీ వినియోగదారులతో ఫొటోలు, వీడియోలు భద్రంగా షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నాలుగేళ్ల పాటు ఈ ఫీచర్‌కు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఓఎస్ అప్గ్రేడ్స్ రాబోతుండడం విశేషం.

Samsung Galaxy A14 5G కెమెరా, బ్యాటరీ:

ఇవి కూడా చదవండి

ఈ Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపీ ట్రిపుల్ లెన్స్ రేర్ కెమెరా ఉంటుంది. 13ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ సామ్సంగ్ గ్యాలెక్సీ ఏ14 5జీ వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు ఈ మొబైల్‌ను వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

భారత్‌లో Samsung Galaxy A14 5G ధర:

భారత్‌లో Samsung Galaxy A14 5G ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్-64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్-128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 గాను.. 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 20,999గాను ఉంది. డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్‌లలో ఈ Samsung Galaxy A14 5G లభిస్తుండటం విశేషం. ఇక https://www.samsung.com/ లేదా శాంసంగ్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ స్టోర్స్‌తో పాటు వివిధ ఆన్లైన్ వేదికల్లో ఈ నెల 20 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..