Electric Scooter: చిన్నగా కనిపిస్తున్నా మహా గట్టిది గురూ.. సింగిల్‌ చార్జ్‌పై ఏకంగా 160 కిలోమీటర్లు.. వివరాలు ఇవి..

వాటిల్లో కూడా బైక్‌ల కన్నా స్కూటర్లకే క్రేజ్‌ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సిటీ పరిధి అవసరాలకు, లోకల్‌లో తిరగడానికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉపయుక్తంగా ఉండటంతో అందరూ వాటినే ప్రిఫర్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన వాహనాల తయారీ దారులు ఎలక్ట్రిక్‌ స్కూటర్లనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు.

Electric Scooter: చిన్నగా కనిపిస్తున్నా మహా గట్టిది గురూ.. సింగిల్‌ చార్జ్‌పై ఏకంగా 160 కిలోమీటర్లు.. వివరాలు ఇవి..
Rugged G1
Follow us
Madhu

|

Updated on: May 05, 2023 | 10:20 AM

ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో కూడా బైక్‌ల కన్నా స్కూటర్లకే క్రేజ్‌ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సిటీ పరిధి అవసరాలకు, లోకల్‌లో తిరగడానికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉపయుక్తంగా ఉండటంతో అందరూ వాటినే ప్రిఫర్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన వాహనాల తయారీ దారులు ఎలక్ట్రిక్‌ స్కూటర్లనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లోకి విడుదలవుతూనే ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను అందులో ఉంటున్నాయి. ఇదే క్రమంలో ఈ బైక్ గో కంపెనీ రగ్గడ్‌ జీ1(Rugged G1) అనే సరికొత్త ఎలక్ట్రిక స్కూటర్‌ లేటెస్ట్‌ గా మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. దీనికి సంంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

160 కిలోమీటర్ల రేంజ్‌..

ఈ రగ్గడ్‌ జీ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ చూడటానికి మోపెడ్‌ను పోలి ఉంటుంది. ఈ స్కూటర్‌ అధిక సామర్థ్యంతో పాటు అధిక పవర్‌ అవుట్‌ పుట్‌ అందిస్తుంది. దీనిలో ముఖ్యమైన అంశం ఏమిటంటే దాని రేంజ్‌. దీనిలో బ్యాటరీ సింగిల్‌ చార్జ్‌ పై దాదాపు 160 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది. ఇది వంటి అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. గృహిణులకు, వృద్ధులకు సులభంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

75 కిలోమీటర్ల గరిష్ట వేగం..

దీనిలో బ్యాటరీ 1.9kwh సామర్థ్యంతో ఉంటుంది. గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. దీని వల్ల ఇది సిటీ రోడ్లతో పాటు గ్రామీణ వాతావరణంలోనూ ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. దీనిలో 1500వాట్ల సామర్థ్యంతో బీఎల్‌డీసీ మోటార్‌ ఉంటుంది. ఈ అధిక సామర్థ్యం కలిగిన మోటార్‌ కారణంగా ఎత్తుగల ప్రాంతాలకు సులువుగా ఎక్కగలుగుతుంది. అలాగే అధిక బరువులు కూడా మోయగలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

దీనిలో బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అవడానికి నాలుగు గంటలు పడుతుంది. దీని ధర రూ. 78,498 నుంచి రూ. 1,02,514 ఎక్స్‌షోరూం మధ్య ఉంటుంది. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!