పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ. 299తో రూ. 10 లక్షల కవరేజీ.. పూర్తి వివరాలు ఇవే..

|

Aug 26, 2022 | 1:42 PM

India Post Office: ఇప్పుడు కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఆరోగ్య బీమా ఉండటం చాలా ముఖ్యం. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఇందుకోసం ఒక మంచి ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో సంవత్సరానికి రూ. 299, రూ. 399 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా పొందవచ్చు.

పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ. 299తో రూ. 10 లక్షల కవరేజీ.. పూర్తి వివరాలు ఇవే..
Post Office Money
Follow us on

India Post Office: దేశంలో కరోనా మహమ్మారి తర్వాత, ప్రజలు తమ ఆరోగ్య బీమా కోసం కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. ఇప్పుడు కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఆరోగ్య బీమా ఉండటం చాలా ముఖ్యం. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఇందుకోసం ఒక మంచి ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ ప్రత్యేక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ కోసం టాటా AIGతో కలిసి పని చేస్తోంది. ఇందులో సంవత్సరానికి రూ. 299, రూ. 399 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా పొందవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

చికిత్స కోసం డబ్బు..

బీమా పాలసీలో మీకు IPD ఖర్చుల కోసం రూ. 60 వేలు, ప్రమాదవశాత్తు గాయం అయితే OPD కోసం రూ. 30 వేలు ఇస్తారు. మరోవైపు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారంగా అందజేయనున్నారు. ఆధారపడిన ఇద్దరు పిల్లల చదువుల కోసం రూ.1 లక్ష అందిస్తుంది. దీనితో పాటు రవాణా ఖర్చు కూడా అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రమాదంలో అంగవైకల్యం చెందినా..

ప్రమాదంలో పాలసీదారుడు అంగవైకల్యం పొందితే.. ఖాతాదారునికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం ఆధారపడిన వారికి రూ. 5000 సహాయం, పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష పరిహారం అందిస్తుంది.

రూ.299 పాలసీ..

రూ .299 ప్రమాద రక్షణ పథకం కింద పాలసీ తీసుకున్నా, రూ.399 ప్రమాద రక్షణ పథకంలో ఇస్తున్న అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఈ రెండు పథకాల మధ్య ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.299 ప్రమాద రక్షణ పథకంలో మరణించిన వారిపై ఆధారపడిన వారి పిల్లల చదువుకు సహాయం మొత్తం అందుబాటులో ఉండదు.

రూ. 399 ప్లాన్..

పోస్ట్ టాక్స్ ప్రీమియం: రూ. 399

పాలసీదారు మరణిస్తే: రూ. 1000000

శాశ్వత వైకల్యం: రూ.1000000

పాక్షిక వైకల్యం: రూ.1000000

వైద్య ఖర్చులు IPD: రూ.60,000లోపు

ప్రమాదవశాత్తు వైద్య ఖర్చు OPD: రూ. 30,000లలోపు..

విద్యా ప్రయోజనాలు: SIలో 10% లేదా రూ. 100000

ఆసుపత్రిలో రోజువారీ నగదు : 10 రోజుల వరకు రోజుకు రూ.1000లు

కుటుంబ రవాణా ప్రయోజనం: రూ. 25000 లేదా అసలు ఏది తక్కువైతే అది

అంత్యక్రియల కోసం: రూ. 5000