Car Sales: టెంప్టింగ్ ఆఫర్.! రూ. 14 లక్షల SUV కారు కేవలం రూ. 6.5 లక్షలకే.. పూర్తి వివరాలు..

|

May 15, 2024 | 12:18 PM

సొంతంగా ఇల్లు, ఓ కారు.. అయిదంకెల జీతం.. ఇదే ప్రతీ ఒక్కరు కోరుకునేది. ఈ కలలు నేరవేర్చుకునేందుకే రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. సరే.! ధనవంతులకైతే ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి. మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి.? అందుకే అలాంటివారికి అదిరిపోయే డీల్స్‌తో ముందుకు వచ్చేశాం.

Car Sales: టెంప్టింగ్ ఆఫర్.! రూ. 14 లక్షల SUV కారు కేవలం రూ. 6.5 లక్షలకే.. పూర్తి వివరాలు..
Car Sales
Follow us on

సొంతంగా ఇల్లు, ఓ కారు.. అయిదంకెల జీతం.. ఇదే ప్రతీ ఒక్కరు కోరుకునేది. ఈ కలలు నేరవేర్చుకునేందుకే రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. సరే.! ధనవంతులకైతే ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి. మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి.? అందుకే అలాంటివారికి అదిరిపోయే డీల్స్‌తో ముందుకు వచ్చేశాం. సొంతంగా కారు కొనాలనుకుంటున్నారా.? మీకోసం కొన్ని ఆన్‌లైన్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సెకెండ్ హ్యాండ్ కార్లు.. వారి బడ్జెట్‌లోనే ఈ సైట్లలో దొరుకుతున్నాయి. వీటిపై గ్యారంటీలు, ఇతరత్రా మనీ బ్యాక్ లాంటివి కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిపి ఓ పిక్నిక్‌కు వెళ్లేందుకు అవసరమయ్యే.. SUV కారు కొనాలనుకుంటే.. ఇది మీకోసమే. సుమారు రూ. 14 లక్షలు విలువ చేసే ఈ కారు.. కేవలం రూ. 6.50 లక్షలకే దొరుకుతోంది. Cardekho.comలో అమ్మకానికి లభిస్తున్న ఈ SUV కారు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

Cardekho.comలోని పోస్ట్ ప్రకారం, ఈ వాహనం మే 2014వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయబడింది. అలాగే మేనిఫ్యాక్చరింగ్ కూడా అదే సంవత్సరంలో జరిగింది. ఇది మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో కలిగి ఉంది. దీని ఫ్యూయల్ టైప్ డీజిల్ కాగా.. ఇప్పటిదాకా 1,42,000 కిలోమీటర్లు నడిచింది. దీని పవర్ స్టీరింగ్, హీటర్, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, హెడ్ లైట్స్, సెంట్రల్ లాకింగ్, ఎయిర్ కండీషనర్ అన్ని కూడా సరిగ్గా పని చేస్తున్నాయి. ఈ కారును అమ్మకానికి పెట్టినది ఫస్ట్ ఓనర్‌ కాగా.. ఆర్టీఓ రంగారెడ్డికి చెందినది.

ఈ SUV కారు 140బిహెచ్‌పి పవర్, 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. దీని మైలేజ్ దాదాపు 15.1 వరకు ఉంటుంది. 7 సీటింగ్ క్యాపాసిటీ కలిగిన ఈ కారుకు ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్‌పైరీ అయిందని పోస్టులో పేర్కొన్నారు. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.(Source)