SBI FD Scheme: రూ.10 లక్షల పెట్టుబడితో రూ.20 లక్షల రాబడి.. ఆ ఎస్‌బీఐ ఎఫ్‌డీ స్కీమ్‌తో అదిరే లాభాలు
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ మెచ్యూరిటీల పథకాలపై సాధారణ కస్టమర్‌ల కంటే సీనియర్ సిటిజన్‌లు ఎక్కువ వడ్డీని పొందుతారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ లెండర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకూ ఎఫ్‌డీల ఎంపికను అందిస్తుంది. వివిధ మెచ్యూరిటీల ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 6.5 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వార్షిక వడ్డీని ఇస్తుంది.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి పెట్టుబడిదారుడికి మార్కెట్ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వారికి సురక్షితమైన, స్థిరమైన ఆదాయం కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందుబాటులో ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ మెచ్యూరిటీల పథకాలపై సాధారణ కస్టమర్‌ల కంటే సీనియర్ సిటిజన్‌లు ఎక్కువ వడ్డీని పొందుతారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ లెండర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకూ ఎఫ్‌డీల ఎంపికను అందిస్తుంది. వివిధ మెచ్యూరిటీల ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 6.5 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వార్షిక వడ్డీని ఇస్తుంది. ఈ ఎస్‌బీఐ ఎఫ్‌డీ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రూ. 10 లక్షలు రూ. 20 లక్షలు అయ్యేదిలా
ఎస్‌బీఐకు సంబంధించిన 10 సంవత్సరాల మెచ్యూరిటీ స్కీమ్‌లో ఒక సాధారణ కస్టమర్ ఏకమొత్తంగా రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ ఎఫ్‌డీ కాలిక్యులేటర్ ప్రకారం పెట్టుబడిదారుడు 6.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో మెచ్యూరిటీపై మొత్తం రూ.19,05,558 పొందుతారు. ఇందులో వడ్డీ ద్వారా రూ.9,05,558 స్థిర ఆదాయం ఉంటుంది. మరోవైపు ఎస్‌బీఐకు సంబంధించిన 10 సంవత్సరాల మెచ్యూరిటీ స్కీమ్‌లో ఒక సీనియర్ సిటిజన్ ఏకమొత్తంగా రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలి. ఎస్‌బీఐ ఎఫ్‌డీ కాలిక్యులేటర్ ప్రకారం సీనియర్ సిటిజన్లు 7.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో మెచ్యూరిటీపై మొత్తం రూ.21,02,349 పొందుతారు. ఇందులో వడ్డీ ద్వారా రూ.11,02,349 స్థిర ఆదాయం ఉంటుంది.
వడ్డీ ఆదాయంపై పన్ను ఇలా
బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు/టర్మ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఎఫ్‌డీ పథకాలపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) వర్తిస్తుంది. అంటే ఎఫ్‌డీకు సంబంధించిన మెచ్యూరిటీపై అందుకున్న మొత్తం మీ ఆదాయంగా పరిగణిస్తారు. అలాగే మీరు స్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ నిబంధనల ప్రకారం డిపాజిటర్ పన్ను మినహాయింపు నుంచి మినహాయింపు కోసం ఫారమ్ 15జీ/15హెచ్‌ని సమర్పించవచ్చు. మరోవైపు కస్టమర్‌లు 5 సంవత్సరాల పన్ను ఆదా ఎఫ్‌డీపై సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి