బుల్లెట్ బైక్ ప్రియులకు గుడ్ న్యూస్… ఈసారి ఏంటంటే..?

‘రాయల్ ఎన్‌ఫీల్డ్’.. ఈ పేరు వింటేనే బైక్ రైడర్లు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. దీనిపై లాంగ్ రైడ్స్‌కు వెళ్తే.. ఆ మజానే వేరు. అయితే దీని సామర్ధ్యం, అందులో గల ఫీచర్లను దృష్టిలో పెట్టుకుంటే కాసింత వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లోనే కొత్త మోడల్ బైక్స్‌ను ఆవిష్కరిస్తోంది. తాజాగా బుల్లెట్ 350, క్లాసిక్ 350 అనే రెండు సిరీస్‌లను లాంచ్ చేయగా.. […]

బుల్లెట్ బైక్ ప్రియులకు గుడ్ న్యూస్... ఈసారి ఏంటంటే..?
Follow us

|

Updated on: Sep 25, 2019 | 4:35 PM

‘రాయల్ ఎన్‌ఫీల్డ్’.. ఈ పేరు వింటేనే బైక్ రైడర్లు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. దీనిపై లాంగ్ రైడ్స్‌కు వెళ్తే.. ఆ మజానే వేరు. అయితే దీని సామర్ధ్యం, అందులో గల ఫీచర్లను దృష్టిలో పెట్టుకుంటే కాసింత వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లోనే కొత్త మోడల్ బైక్స్‌ను ఆవిష్కరిస్తోంది. తాజాగా బుల్లెట్ 350, క్లాసిక్ 350 అనే రెండు సిరీస్‌లను లాంచ్ చేయగా.. త్వరలోనే థండర్ బర్డ్ 350 సిరీస్‌ను సిద్ధం చేయనుంది.

ఈ కొత్త మోడల్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లా డ్యూయల్ ఛానల్ ఏబీస్ మాదిరిగా కాకుండా క్లాసిక్ 350 ఎస్‌లోని ‘ఎస్’ సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ను సూచిస్తుంది. బండి ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ అమర్చబడి ఉంటుంది. ఇక మిగిలిన అన్ని ఫీచర్స్ కొత్తగా విడుదలైన క్లాసిక్ 350, బుల్లెట్ 350లాగే ఉంటాయి. ఇది ప్యూర్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో  ఇది 5,250 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 19.8 బిహెచ్‌పి,  4,000 ఆర్‌పీఎం వద్ద 28 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక ఈ థండర్ బర్డ్ మోడల్ బైక్ ధర రూ. 1.57 లక్షలుగా నిర్ణయించారు. ఇకపోతే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన బుల్లెట్ 350, క్లాసిక్ 350ఎస్ మోడల్ బైక్‌ల ధరలు వాటి మార్కెట్ ప్రైస్ కంటే రూ.8 నుంచి 9 వేల తక్కువగా లభించడం గమనార్హం. వీటి మాదిరిగానే థండర్ బర్డ్ 350 కూడా దాదాపు అదే ధరకు వస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఇకపోతే ఈ మోడల్ బైక్స్ వచ్చే నెల మార్కెట్‌లోకి రానున్నాయి.