రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఈ ఏడాది కొత్తగా లాంచ్ అయిన బైక్ హిమాలయన్ 450. 2023 మోటోవెర్స్ లో దీనిని ఆవిష్కరించింది. అన్ని కలర్ ఆప్షన్లలోనూ దీని ధరను కూడా ప్రకటించింది. అయితే ఆ ధరలు 2024 జనవరి ఒకటో తేదీ నుంచి పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బేస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 2.69లక్షలు ఉంది. జనవరి ఒకటి నుంచి ఈ ధర రూ. 2.74లక్షలకు పెరుగుతాయి. అదే సమయంలో ప్రీమియం వేరియంట్స్ అయిన సమ్మిట్, హ్యాన్లే బ్లాక్ మోడల్స్ రూ. 2.79లక్షలు, 2.84లక్షలు ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్స్ సేమ్ ఫీచర్లతో వస్తాయి. పెయింట్ స్కీమ్లలో మాత్రం మార్పులుంటాయి. అయితే పాత ధరలు ఈ డిసెంబర్ 31 వరకూ అందుబాటులు ఉంటాయి. మీరు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా.. లేక షోరూంలో వెళ్లి ప్రీ బుక్ చేసుకున్నా.. ప్రారంభ ధరలే కొనసాగుతాయి. డిసెంబర్ 31 తర్వాత మాత్రం ధరలు పెరుగుతాయి.
వినియోగదారులు డిసెంబర్ 31కి ముందే బైక్ బుక్ చేసుకున్నా.. జనవరి ఒకటో తేదీ తర్వాత కలర్ ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే కొత్త ధర ప్రకారం నగదు చెల్లించాల్సి ఉంటుందని డీలర్లు ప్రకటించారు. డిసెంబర్ 31లోపు కలర్ చేంజ్ కోసం ప్రయత్నిస్తే.. పాత ప్రారంభ ధరలే వర్తిస్తాయి.
హిమాలయన్ 411 తర్వాత వచ్చిన మోడల్ ఇది. దీనిలో ప్రధాన హైలైట్లు ఏంటంటే హిమాలయన్ న్యూ సర్కులర్ హెడ్ లైట్, బ్రాడ్ ఫ్యూయల్ ట్యాంక్, విండ్ స్క్రీన్, అప్ రైట్ రైడర్ ట్రై యాంగిల్ ఉంటుంది. ఇది బైక్ అపీరియన్స్ బాగా ఉంచుతుంది. సిగ్నల్ లైట్స్, వెనకాల లైట్లతో పాటు అన్ని పూర్తి ఎల్ఈడీ లైటింగ్ తో వస్తుంది. స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తోంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ లో 450సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8000ఆర్పీఎం వద్ద 40బీహెచ్పీ, 5,500 ఆర్బీఎం వద్ద 40ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ బైక్ లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. రైడ్ బై వైర్, టీఎఫ్టీ స్క్రీన్, నావిగేషన్ కోసం స్మార్ట్ కనెక్టివిటీ, మీడియా కంట్రోల్స్, ఎకో, పెర్ఫామెన్స్ రైడ్ మోడ్స్, స్విచబుల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..