రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ వేతనం ఏడాదికి రూ.15 కోట్లు ఉంటుంది. అయితే గత 12 ఏళ్లుగా ఆయన జీతం ఇంతే.. అభివృద్ది చెందుతున్న వ్యాపారంతోపాటు ఆయన జీతం కూడా రూ.24 కోట్లు అందుకునే ఛాన్స్ అంన్నప్పటికీ ముకేశ్ మాత్రం రూ.15 కోట్లకే స్టాప్ చేశాడు. ఇందులో జీతం మాత్రమే కాదు ఇతర అలవెన్సులు, కమిషన్ కలిసి ఉంటాయి. అయితే, గత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేస్తున్నారు. ముకేశ్ అంబాని జీతం తీసుకోక పోవడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది.
కరోనా మహమ్మారి వ్యాపార రంగాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన నేపథ్యంలో తన ఏడాది జీతాన్ని వదులుకుంటున్నట్టు అంబానీ ప్రకటించారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెల్లడించింది. కంపెనీకి సంబంధించి వార్షిక నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఇదిలావుంటే… బోర్డు సభ్యులైన నిఖిల్, హిత్ మేస్వానీలు మాత్రం యథాతథంగా రూ. 24 కోట్ల చొప్పున వేతనం తీసుకున్నారు. రూ. 17.28 కోట్ల కమిషన్ కూడా కలిసింది. ఆర్ఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో నీతా అంబానీ..గత ఆర్థిక సంవత్సరానికి గాను..రూ. 8 లక్షల సిట్టింగ్ ఫీజుతో పాటు..రూ. 1.65 కోట్ల కమిషన్ ఆర్జించినట్లు వార్షిక నివేదిక వెల్లడించింది.