AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటివి చెప్పండి భయ్యా.. EMI కట్టే పనిలేని బ్యాంక్ లోన్! ఎవరు, ఎంత తీసుకోవచ్చంటే..?

సాధారణ రుణాలకు భిన్నంగా, రివర్స్ మార్టగేజ్ లోన్ సీనియర్ సిటిజన్లకు ఒక వరంగా చెప్పవచ్చు. ఈ పథకం కింద, 60 ఏళ్లు పైబడిన వారు తమ ఇంటిని భద్రతగా చూపించి, బ్యాంకుల నుండి నిర్ణీత మొత్తాన్ని నెలవారీగా పొందవచ్చు. ఇది వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందిస్తుంది, EMI చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇలాంటివి చెప్పండి భయ్యా.. EMI కట్టే పనిలేని బ్యాంక్ లోన్! ఎవరు, ఎంత తీసుకోవచ్చంటే..?
No Emi Loan For Seniors
SN Pasha
|

Updated on: Sep 08, 2026 | 7:13 AM

Share

సాధారణంగా బ్యాంకులో రుణం తీసుకుంటే ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని EMI రూపంలో తిరిగి చెల్లించాలి. పర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి రుణాలు కొన్ని సంవత్సరాల్లో పూర్తవుతాయి. అయితే హోమ్ లోన్ తీసుకుంటే 20 నుంచి 30 ఏళ్ల వరకు EMI చెల్లించాల్సి రావచ్చు. కానీ సీనియర్ సిటిజన్లకు మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన ఓ రుణ సదుపాయం అందుబాటులో ఉంది. అదే రివర్స్ మార్టగేజ్ లోన్.

ఇంటినే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు

వృద్ధాప్యంలో రెగ్యులర్ ఆదాయం లేకపోవడం చాలామందికి ఆర్థిక సమస్యగా మారుతుంది. పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా సొంతంగా ఖర్చులు నిర్వహించుకోవాలనుకునే వారికి రివర్స్ మార్టగేజ్ ఉపయోగపడుతుంది. సొంతంగా ఉన్న ఇంటిని బ్యాంకుకు భద్రతగా చూపించి ఈ రుణాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఇంటి యాజమాన్య హక్కులు రుణగ్రహీత వద్దే కొనసాగుతాయి.

బ్యాంకే డబ్బులు చెల్లిస్తుంది

సాధారణ రుణంలో కస్టమర్ బ్యాంకుకు EMI చెల్లిస్తే.. రివర్స్ మార్టగేజ్‌లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటుంది. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్‌కు బ్యాంకు నిర్ణయించిన మొత్తాన్ని నెలవారీగా లేదా నిబంధనల ప్రకారం ఇతర విధానంలో అందిస్తుంది. ఈ మొత్తాన్ని వృద్ధాప్య ఖర్చులు, వైద్య అవసరాలు, రోజువారీ జీవన వ్యయాలకు ఉపయోగించుకోవచ్చు. రుణం ఉన్నప్పటికీ సాధారణ EMI చెల్లింపు భారం ఉండదు.

జీవితాంతం ఇంట్లోనే నివాసం

రివర్స్ మార్టగేజ్ తీసుకున్న తర్వాత కూడా సీనియర్ సిటిజన్లు తమ ఇంట్లోనే నివసించవచ్చు. సాధారణంగా రుణగ్రహీత లేదా దంపతుల విషయంలో చివరి రుణగ్రహీత మరణించడం, ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేయడం వంటి పరిస్థితుల్లోనే రుణం సెటిల్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

వారసులకు కూడా అవకాశం

సీనియర్ సిటిజన్ల మరణం తర్వాత కుటుంబ సభ్యులు ఇంటిని తమ వద్దే ఉంచుకోవాలనుకుంటే, బ్యాంకుకు బకాయి ఉన్న రుణం, వర్తించే వడ్డీ తదితర మొత్తాలను చెల్లించి ఆస్తిని విడిపించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాంకు నిబంధనల ప్రకారం ఆస్తిని విక్రయించి బకాయిలను రికవరీ చేయవచ్చు.

ఎవరికి వర్తిస్తుంది?

సాధారణంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. ఇంటిపై స్పష్టమైన యాజమాన్య హక్కులు ఉండాలి. అయితే వయస్సు, ఆస్తి విలువ, రుణ పరిమితి, చెల్లింపు విధానం వంటి నిబంధనలు బ్యాంకును బట్టి మారవచ్చు. కాబట్టి రుణం తీసుకునే ముందు సంబంధిత బ్యాంకు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

Follow Us