Revamp Buddie 25: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.999కే బుకింగ్ సదుపాయం

పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే ముఖ్యంగా పట్టణ ప్రాంత వాసులు మాత్రం ఎక్కువగా..

Revamp Buddie 25: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.999కే బుకింగ్ సదుపాయం
Revamp Buddie

Edited By: Anil kumar poka

Updated on: Dec 20, 2022 | 12:21 PM

పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే ముఖ్యంగా పట్టణ ప్రాంత వాసులు మాత్రం ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొంటున్నారు. కంపెనీలు కూడా పట్టణవాసుల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వేరియంట్లు రిలీజ్ చేస్తున్నాయంటే వాటికి ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. కొత్తగా రివాంప్ మోటో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బుడ్డీ 25 ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. యూట్యూబ్, లింక్డ్ ఇన్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా స్కూటర్ ను ప్రమోట్ చేసింది. మరి దాని స్పెసిఫికేషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం.

రివాంప్ మోటో రిలీజ్ చేసిన బుడ్డీ 25 ధర భారతీయ మార్కెట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ.66,999 గా కంపెనీ ప్రకటించింది. అంతేకాక కంపెనీ వెబ్ సైట్ రూ.999 తో బుకింగ్ సదుపాయం ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి డెలివరీ ప్రారంభిస్తామని పేర్కొంది. అలాగే ఈఎంఐ ద్వారా కూడా ఈ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. రివాంప్ మోటో నో కాస్ట్ ఈఎంఐను ఆఫర్ చేస్తుంది. 

ఓ సారి చార్జ్ చేస్తే 70 కిలో మీటర్ల ప్రయాణం

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 48 V, 25 Ah లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించారు. దీంతో ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే 70 కిలో మీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలో మీటర్లు. ఈ స్కూటర్ ను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే నడపవచ్చు.  స్కూటర్ లుక్ భిన్నంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ప్రయాణించడానికి వీలుగా ఈ స్కూటర్ ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 

ఇవి కూడా చదవండి

ఒకినివా ఆర్ 30 కు గట్టి పోటీ

ప్రస్తుతం మార్కెట్ లో ఈ స్కూటర్ రేంజ్ లో ఒకినివా ఆర్ 30 అందుబాటులో ఉంది. బుడ్డీ 25 అందుబాటులోకి వస్తే ఆర్ 30 కు గట్టి పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..