AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home: ఆఫీస్‌కు వస్తారా.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తారా.. సర్వే ఏం చెబుతుంది..

కరోనాతో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం(Work From Home) చేస్తున్నారు.

Work From Home: ఆఫీస్‌కు వస్తారా.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తారా.. సర్వే ఏం చెబుతుంది..
Srinivas Chekkilla
|

Updated on: Jan 30, 2022 | 7:07 PM

Share

కరోనాతో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం(Work From Home) చేస్తున్నారు. తొలుత వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయడానికి ఇబ్బంది పడ్డ ఉద్యోగుల్లో(employees) ఇప్పుడు చాలా మార్పు వచ్చినట్లు ఓ సర్వే(survay) పేర్కొంది. ఇప్పుడు చాలా మంది ఆఫీసుకు వెళ్లడం కంటే ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రముఖ ఉద్యోగ కన్సల్టెన్సీ సంస్థ ‘సైకీ’.. ‘టెక్‌ ట్యాలెంట్‌’ పేరిట ఓ సర్వే చేశారు. ఇందులో నాలుగు ఖండాల్లోని ప్రముఖ కంపెనీల మానవ వనరుల విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి లీడర్ల ద్వారా ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకున్నారు.

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అలవాటు పడ్డారు. దాదాపు 82 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ఇంటి నుంచి పనిచేస్తే మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు, ఒత్తిడి కూడా ఉండడం లేదని 64 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులతో సంప్రదింపులు జరపాల్సిన హెచ్‌ఆర్‌ విభాగానికి సైతం.. వర్చువల్‌గా మాట్లాడడం సాధారణ విషయంగా మారింది.

పూర్తిస్థాయిలో కార్యాలయాల్లో పనిచేసేలా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం కష్టంగా మారిందని 80 శాతం మంది హెచ్‌ఆర్‌ మేనేజర్లు చెప్పారు. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్న చాలా మంది.. తమ సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయం కల్పించాలని ఆశిస్తున్నారు. దీంతో కంపెనీలకు ఇక ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని.. మంచి నైపుణ్యం గల ఉద్యోగులు కావాలంటే తప్పనిసరిగా వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాల్సిన అసవరం ఏర్పడిందన్నారు.

ఉద్యోగుల నియామక ప్రక్రియలో అభ్యర్థుల మానసిక స్థితిని అంచనా వేసే ప్రక్రియను ఉపయోగిస్తున్నట్లు కేవలం 18 శాతం నియామక మేనేజర్లు మాత్రమే తెలిపారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం సాధారణ విషయంగా మారితే గనక ఆఫీసులు అప్పుడప్పుడు జరిగే సమావేశ కేంద్రాలుగా మారనున్నాయి. నైపుణ్యంగల ఉద్యోగులను అట్టిపెట్టుకోవాలంటే.. ఎప్పటికప్పుడు వారి ప్రతిభను గుర్తించి ప్రశంసించాల్సి ఉంటుంది. దాని కోసం కొత్త పద్ధతుల్ని అనుసరిస్తున్నట్లు 36 శాతం హెచ్‌ఆర్‌ విభాగాధిపతులు చెప్పారు.

Read Also.. Budget-2022: ఈ బడ్జెట్‌లో ఆ లాభాలపై పన్ను మినహాయిస్తారా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..