Jio: డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా.. అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌ తీసుకొచ్చిన జియో.. ఓ లుక్కేయండి..

|

Sep 18, 2022 | 3:24 PM

Reliance Jio: టెలికం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించిన సంస్థ రిలయన్స్‌ జియో. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌...

Jio: డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా.. అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌ తీసుకొచ్చిన జియో.. ఓ లుక్కేయండి..
Jio Recharge Plans
Follow us on

Reliance Jio: టెలికం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించిన సంస్థ రిలయన్స్‌ జియో. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ విస్తృతి పెరిగిన తర్వాత జియో డేటా, కాల్స్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొత్తగా నాలుగు రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేయండి..

రూ. 419..

రూ. 419లతో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాటిడీటితో 84 జీబీ డేటాను అందిస్తారు. రోజుకు 3జీబీ ఫాస్ట్‌ ఇంటర్‌నెట్‌ స్పీడ్ పొందొచ్చు. వీటితో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తారు. ఇక డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ మొబైల్‌ వెర్షన్‌కి 3 నెలల పాటు సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

రూ. 601 ప్లాన్..

ఈ ప్లాన్‌లో యూజర్లకు మొత్తం 90 జీబీ డేటాను అందిస్తారు. 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3 జీబీ డేటా అందిస్తారు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 SMSలు పొందొచ్చు. అలాగే యూజర్లకు ఒక సంవత్సర డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తారు.

ఇవి కూడా చదవండి

రూ. 1,199..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి రోజుకు 3 జీబీ డేటా చొప్పున 84 రోజుల వ్యాలిడీటీ లభిస్తుంది. మొత్తం 252 జీబీ డేటాను పొందొచ్చు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 SMSలతో పాటు 3 నెలల వ్యాలిడిటీతో కూడిన రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.

రూ. 4,199..

ఇది ఓటీటీ కోసం జియో అందిస్తున్న మరో ప్రత్యేక రీఛార్జ్‌ ఆప్షన్‌. దీనిద్వారా ఏడాది వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ చొప్పున 1095 జీబీ డేటా అందిస్తారు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 SMSలతో పాటు ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..