Reliance Industries: ఈ సంస్థను విలీనం చేయడం లేదు.. కీలక ప్రకటన చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

|

Apr 23, 2023 | 5:04 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పెద్ద వ్యాపారాన్ని విలీనం చేసే ప్రణాళిక నుంచి రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ వ్యాపారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. రిలయన్స్ ఇండస్ట్రీస్, పునరుత్పాదక ఇంధన వ్యాపారం ఆర్‌ఎన్‌ఈఎల్‌ కింద మాత్రమే నడుస్తుందని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు తన ఫైలింగ్‌లో తెలిపింది..

Reliance Industries: ఈ సంస్థను విలీనం చేయడం లేదు.. కీలక ప్రకటన చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
Reliance Industries
Follow us on

బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ (RNEL)ని విలీనం చేయడం లేదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం ఇస్తూ ఈ ప్రకటనను వెల్లడించింది. ఏప్రిల్ 21న జరిగిన న్యూ ఎనర్జీ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రక్చర్‌పై సమీక్షా సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. చమురు నుంచి టెలికాం వరకు వ్యాపారం చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, పునరుత్పాదక ఇంధన వ్యాపారం ఆర్‌ఎన్‌ఈఎల్‌ కింద మాత్రమే నడుస్తుందని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు తన ఫైలింగ్‌లో తెలిపింది.

గత ఏడాది మే నెలలో ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీ న్యూ ఎనర్జీ (RNEL) వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్‌ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఎలాంటి డీల్ లేదా కొత్త ఎనర్జీ, ఇతర పనుల కోసం నిధులను సేకరించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రిలయన్స్ ఈ ప్లాన్ నుంచి ఒక అడుగు వెనక్కి తీసుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 2021లో క్లీన్ ఎనర్జీ ఎంటర్‌ప్రైజ్‌గా వేగంగా స్థిరపడాలని ప్రకటించారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని ప్రకటించారు. ముకేశ్ అంబానీ మూడేళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేశారు. ఇందులో ఆర్‌ఐఎల్ వచ్చే మూడేళ్లలో న్యూ ఎనర్జీ కోసం రూ.60,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. అలాగే వివిధ ఇతర వ్యాపారాల కోసం రూ.15,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. భారతదేశపు అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.19,299 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది కాలంతో పోలిస్తే కంపెనీ 19 శాతం ఎక్కువ లాభాన్ని నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి